Healthy Lifestyle: మనిషి జీవించి ఉండడం కాదు.. సంపూర్ణ ఆరోగ్య వంతుడిగా ఉండాలి.. అప్పుడే.. నచ్చినది తినగలడు.. మెచ్చిన పని చేయగలడు.. అలసట లేకుండా ఆడుతూ పాడుతూ జీవించ గలడు.. మరి మనిషి ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఏం చేయాలి? అంటే.. అది మనిషి చేతుల్లోనే ఉంటుంది.. తీసుకునే ఆహారం, చేసే శ్రమ, జీవించే విధానం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.. ముఖ్యంగా ఐదు విషయాలపై సంపూర్ణ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.. అందులో ఒకటి పరిపూర్ణ ఆహారం.. మానవ శరీరంలోని కోట్లకొద్ది కణాలకు పోషణ అవసరం. ఆహారం ద్వారా వాటికి ఆ శక్తి అందుతుంది. అయితే, మనం తీసుకునే ఆహారంలో ఏ మేరకు ఆరోగ్యకర పదార్థాలు ఉన్నాయన్నది చూసుకోవాలి.. ఆహార పద్ధతుల్లో మార్పులు వచ్చాయి. పీచు పదార్థాలు లేకపోవడం.. చక్కెర, ఉప్పు వాడడం పెరగడం ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపిస్తున్నాయి.
Read Also: Yogi Adityanath: కాశీ విశ్వనాథుడిని 100 సార్లు దర్శించుకున్న తొలి సీఎం యోగి
రెండోది ప్రతీ వ్యక్తికి శారీరక శ్రమ ఎంతో అవసరం.. కదలకుండా ఉంటే కొత్త రోగాలకు దారి తీసిస్తుంది.. మంచి జీవనశైలికి శారీరక శ్రమ చాలా ముఖ్యం. వాస్తవానికి శోషరస నాళ వ్యవస్థ శరీరానికి కాపలాదారుగా ఉంటుంది. రోజువారీ వ్యాయామం దీని పనితీరును మెరుగుపరుస్తుంది. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు మొదలు ప్రాణాంతక క్యాన్సర్ల వరకు పలు రుగ్మతలను నివారిస్తుంది. వ్యాయామం ఎముకలు, కండరాలను దృఢం చేస్తుంది. ఆరోగ్యకరమైన బరువుకు శారీరక శ్రమ తప్పనిసరి. నడక, సైక్లింగ్, డ్యాన్స్, యోగా, మైదానంలో ఆడే ఆటలన్నీ ఈ కోవలోకే వస్తాయి.. మూడోది వ్యర్థాలకు విముక్తి.. మంచి ఆహారమే కాదు.. వాటిని విసర్జించడం కూడా ఎంతో అవసరం. మనం రాత్రిళ్లు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెదడు మెటబాలిక్ వ్యర్థాలను తొలగిస్తుంది. 2016లో నోబెల్ బహుమతి అందుకున్న పరిశోధన ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. రెండు వారాలకోసారి 24 గంటలపాటు ఉపవాసం చేస్తే, శరీరంలోని వ్యర్థాలన్నీ రీసైకిల్ అవుతాయి. వివిధ మార్గాల ద్వారా శరీరంలోని మలినాలను ఎప్పటికప్పుడు వదిలించుకుంటేనే పరిపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.
Read Also: CM KCR: ప్రగతి భవన్ లో టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ తో సీఎం కేసీఆర్ భేటీ.. విద్యార్థుల్లో ఉత్కంఠ
ఇక, నాల్గోది.. జీవ గడియారం.. ఈ భూమిపై నివసించే ప్రతి ప్రాణికి ఇది ఎంతో కీలకమైనది.. ఎంత విద్యుత్ కాంతులున్నా శరీరానికి పగలు పగలే, రాత్రి రాత్రే. శరీరం పగలు చురుకుగా ఉంటే.. రాత్రి విశ్రాంతిని కోరుకుంటుంది.. అది క్రమంగా తప్పకుండా ఫాలో కాకపోతే శరీరం మొండికేస్తుంది.. కావున.. ఇది రెగ్యులర్‌గా ఫాలో కావాలి. ఇక, ఐదో లక్షణం విషయానికి వస్తే.. భావోద్వేగం- ఆధ్యాత్మికత.. అది ఎలా అంటే పాజిటివ్ భావోద్వేగాలు శరీరంలో వివిధ హార్మోన్ల ఉత్పత్తికి దోహదపడతాయి.. అవి మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి ఉపకరిస్తాయి.. ఒత్తిడికి, అసహనానికి గురైనప్పుడు ఎంతోకొంత బాధ కలుగుతుంది. కానీ, ఆ భావనలను వీలైనంత వరకు అదుపులో ఉంచుకుంటూ.. సంతోషంగా గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ మనసును శాంతపర్చుకుంటే చాలు.. సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం.