భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీలో చేరాలని యువత కలలుకంటుంటారు. నేవీలో చేరి దేశ రక్షణలో భాగం కావాలని భావిస్తుంటారు. మరి మీరు కూడా నేవీలో జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ నేవీలో చేరే అవకాశం వచ్చింది. అవివాహిత పురుషులు, మహిళలు చేరొచ్చు. ఇటీవల ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) జనవరి 2026 (ST 26 కోర్సు) కింద ఆఫీసర్ స్థాయి ఖాళీలను భర్తీ చేయనున్నది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 270 పోస్టులను భర్తీచేయనున్నారు.
భర్తీకానున్న పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (GS(X)/హైడ్రో కేడర్) 60, పైలట్ 26, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్స్ (అబ్జర్వర్స్) 22, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) 18, లాజిస్టిక్స్ 28, ఎడ్యుకేషన్ బ్రాంచ్ 15, ఇంజనీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్(GS) 38, ఎలక్ట్రికల్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ (GS) 45, నావల్ కన్స్ట్రక్టర్ 18 పోస్టులు ఉన్నాయి. మెుత్తం 270 ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. టెక్నికల్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ లలో పోస్టులు భర్తీకానున్నాయి.
Also Read:Lok Sabha: ఆదాయపు పన్ను బిల్లు ప్రవేశపెట్టిన నిర్మలమ్మ
నేవీలో పోస్టులకు పోటీపడే వారు గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి BE/BTech, MBA/BSc/B.Com/MCA/MSc ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం60 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 25వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.