నేడు సుప్రీంకోర్టులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. తాజాగా మోహన్ బాబు పిటిషన్‌పై హైకోర్టులో కూడా విచారణ జరిగింది. పహాడీషరీఫ్ పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగింది. సీనియర్ న్యాయవాది వాదిస్తాడని సమయం కావాలని మోహన్‌బాబు తరఫు న్యాయవాది కోరారు. తదుపరి విచారణ వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న మోహన్‌బాబు విజ్ఞప్తిని గతంలో హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని పీపీ హైకోర్టుకు తెలిపారు.
READ MORE: Lok Sabha: ఆదాయపు పన్ను బిల్లు ప్రవేశపెట్టిన నిర్మలమ్మ
ఇదిలా ఉండగా.. మంచు కుటుంబంలో వివాదం జరిగిన సమయంలో కవరేజ్ కోసం ఆయన నివాసానికి మీడియా ప్రతినిధులు వెళ్లారు. ఆ సమయంలో తన పైన దాడి చేసారంటూ జర్నలిస్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కొరగా కోర్టు అందుకు నిరాకరించిగా.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా నేడు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పు వచ్చిన కొద్ది గంటలకే మళ్లీ హైకోర్టులో విచారణ జరిగింది.
READ MORE: Minister Atchannaidu: టీడీపీ ఆఫీస్‌పై దాడిని అందరూ చూశారు.. వంశీ అరెస్ట్‌లో రహస్యం ఏమీలేదు..