Iran Supreme Leader: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయి. అయితే, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రస్తుతం భద్రతా పరమైన ఆందోళనలను ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్‌తో తీవ్ర ఉద్రిక్తతల వేళా ఆయన భద్రత కోసం రహస్య బంకర్ లో తలదాచుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఖమేనీపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తోందన్న ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం బహిరంగంగా కనిపించడం లేదు.
Read Also: Coolie : ‘చికిటు’ లిరికల్ సాంగ్.. యావరేజ్ రెస్పాన్స్
అయితే, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తాత్కాలికంగా సీజ్ ఫైర్అమలులో ఉన్నప్పటికీ, ఖమేనీ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే, విదేశీ ముఠాలు లేదా మోసాద్ లాంటి గూఢచార సంస్థలు ఆయనపై దాడికి సిద్ధమవుతున్నట్లు టెహ్రాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో అలీ ఖమేనీ మరో దేశానికి తాత్కాలికంగా వెళ్లి తలదాచుకోవాలని యోచిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ నివేదికలో పేర్కొంది. ఇది ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉంది.
Read Also: Ashok Gehlot: రాజస్థాన్ సీఎంను తొలగించడానికి కుట్ర.. మాజీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇక, అలీ ఖమేనీ వేరే దేశానికి వెళ్తే, అది ఇరాన్ రాజకీయ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఎందుకంటే, ఆయనే దేశంలోని అత్యున్నత అధికారి కావడం, అన్ని కీలక నిర్ణయాలపై నియంత్రణ కలిగి ఉండటంతో.. అతడి గైర్హాజరు రాజ్య పాలనలో తీవ్ర అస్థిరతకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఇలాంటి, పరిస్థితుల్లో శత్రు దేశాలైన ఇజ్రాయెల్, అమెరికా మరింత బలంగా టెహ్రాన్ పై దూకుడుగా వ్యవహరించే ప్రమాదం ఏర్పాడే ఛాన్స్ ఉంటుంది.