సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కూలీ’. అక్కినేని నాగార్జున, రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ ఇలా ఒక్కో భాష నుండి ఒక్కో స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ గా రాబోతుంది. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. ఇంతటి భారీ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ అయింది.
కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం వహిస్తున్న ఈ సినిమాలోని చికెట్ సాంగ్ పై హైప్ ఇస్తూ వచ్చారు. తమిళ నటుడు శింబు తండ్రి టి రాజేందర్ వోకల్స్ అందించిన ఈ సాంగ్ ప్రోమోస్ తో బజ్ క్రియేట్ చేసింది. కాగా నిన్న చికెట్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయగా మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అనిరుధ్ మ్యాజిక్ మిస్ అయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రజనీకాంత్ – అనిరుధ్ కాంబో అంటే హుకుమ్, మానసిలాయో వంటి ఫాస్ట్ బీట్స్ ఎక్సపెక్ట్ చేస్తారు కానీ చికెట్ సాంగ్ మరి స్లో గా సాగిందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే కూలీ ఫస్ట్ సింగిల్ యావరేజ్ గా నిలిచిందనే చెప్పాలి. భారీ అంచనాలు మధ్య ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న కూలీ నుండి రాబోయే సాంగ్స్ అనిరుధ్ మ్యాజిక్ ను రిపీట్ చేయగలగాలి. హుకుమ్ లాంటి ట్రెండింగ్ సాంగ్ రావాలి లేదంటే ఫ్యాన్స్ నుండి అనిరుధ్ కు విమర్శలు తప్పవు.
Also Read : Lenin : అయ్యగారు అఖిల్ సరసన అప్సరస..