Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. తన దేశాన్ని ఉద్దేశిస్తూ న్యూ ఇయర్ ప్రసంగం చేశారు. ఆదివారం ప్రసంగంలో రష్యా సైన్యాన్ని ప్రశంసించారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి స్పష్టంగా ప్రస్తావించని ఆయన ఐక్యత కోసం పిలుపునిచ్చారు. గతేడాదికి భిన్నంగా పుతిన్ సైనిక యూనిఫాంలో కనిపించారు. 2024ని ‘ ఇయర్ ఆఫ్ ఫ్యామిలీ’గా అభివర్ణించారు.
Read Also: JP Nadda: “సమాజానికి న్యాయం చేయని వాళ్లే”.. రాహుల్ యాత్రపై జేపీ నడ్డా ఫైర్
తాము చాలా కష్టమైన పనులను పరిష్కరించగలమని, ఎప్పటికి వెనక్కి తగ్గబోమని పదేపదే నిరూపించామని, మమ్మల్ని వేరు చేసే శక్తి లేదని పుతిన్ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. సత్యం, న్యాయం కోసం పోరాటంలో ముందు వరసలో ఉన్న వారందరూ… తమ హీరోలని, మా హృదయాలు మీతోనే ఉంటాయని, మీ గురించి గర్విస్తున్నామరి, మీ ధైర్యాన్ని అభినందిస్తున్నామని పుతిన్ సైన్యాన్ని ఉద్దేశించి అన్నారు.
సోవియట్ నాయకుడు లియోనిడ్ బ్రెజ్నెవ్ ప్రారంభించిన సంప్రదాయాన్ని పుతిన్ కూడా కొనసాగించారు. టెలివిజన్‌లో ప్రసారమైన పుతిన్ న్యూ ఇయర్ ప్రసంగాన్ని మిలియన్ల మంది వీక్షించారు. రష్యాలో ఉంటే 11 టైమ్ జోన్లలో అర్ధరాత్రి ముందు ఈ ప్రసంగాన్ని ప్రసారం చేస్తారు. గతేడాది రష్యా సాధించిన విజయాలను గురించి రష్యా అధినేత మాట్లాడారు.