New Year Eve : ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న గత సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తాం. జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర ప్రారంభం జరుపుకుంటారు.
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. తన దేశాన్ని ఉద్దేశిస్తూ న్యూ ఇయర్ ప్రసంగం చేశారు. ఆదివారం ప్రసంగంలో రష్యా సైన్యాన్ని ప్రశంసించారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి స్పష్టంగా ప్రసంగించని ఆయన ఐక్యత కోసం పిలుపునిచ్చారు. గతేడాదికి భిన్నంగా పుతిన్ సైనిక యూనిఫాంలో కనిపించారు. 2024ని ‘ ఇయర్ ఆఫ్ ఫ్యామిలీ’గా అభివర్ణించారు.
Rave Party: న్యూ ఇయర్‌కి మరి కొన్ని గంటలే సమయం ఉంది. ఈ నేపథ్యంలో యువత కొత్త సంవత్సరాన్ని ఎంతో సంతోషంగా ఆహ్వానించాలని ప్లాన్స్ చేసుకుంది. అయితే కొందరు మాత్రం డ్రగ్స్, రేవ్ పార్టీలను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర థానే నగరంలో రేవ్ పార్టీపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహిచారు. ఈ దాడుల్లో ఏకంగా 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా డ్రగ్స్ తీసుకున్నట్లు భావిస్తున్నారు.
అతనో తహశీల్దార్..అయితేనేం డ్యాన్సర్ లకు ధీటుగా డ్యాన్స్ వేస్తూ అలరించారు. నూతన సంవత్సరం వేడుకల్లో రచ్చరంబోలా చేశారు. చిరంజీవి స్టెప్పులతో డ్యాన్స్ తో గోలీమార్ అంటూ అందరినీ అలరించారు. ఖమ్మం జిల్లాకు చెందిన తాహశీల్దార్. ఖమ్మం జిల్లా కల్లూరు మండల రెవెన్యూ అధికారిగా మంగీలాల్ విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం రెవిన్యూ పరిధిలో పనులతో బిజీగా గడిపే తహశీల్దార్ నూతన సంవత్సర వేడుకల్లో తనదైన స్టైల్ లో డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నారు. మంగీలాల్ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా లోని…