US Venezuela Conflict: వెనిజులాపై అగ్రరాజ్యం అమెరికా బాంబులతో విరుచుకుపడింది. వెనిజులా రాజధాని కారకాస్‌లో శనివారం తెల్లవారుజామున అగ్రరాజ్యం దాడి కారణంగా అనేక శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. వివిధ ప్రాంతాలలో సంభవించిన పేలుళ్ల కారణంగా ప్రజలు భయాందోళనకు గురై, వీధుల్లోకి పరుగులు తీశారు. అమెరికా దాడి కారణంగా వెనిజులా అధ్యక్ష భవనం చుట్టూ సైరన్లు మోగాయి. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:50 గంటల ప్రాంతంలో మొదటి పేలుడు సంభవించింది.
READ ALSO: Allu Arjun : బన్నీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. అట్లీ తర్వాత లోకేష్ కనగరాజ్‌తో?
ఈ పేలుళ్ల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోల్లో రాత్రి చీకటిలో పొగలు ఎగసిపడుతున్నట్లు కనిపించాయి. పలు నివేదికల ప్రకారం.. కారకాస్, తీరప్రాంతాలు, హిగ్యురోట్ విమానాశ్రయం సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అయితే పేలుళ్లపై వెనిజులా ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ సంఘటనల మధ్య అమెరికా.. వెనిజులా అన్ని విమానాలకు గగనతలాలను మూసివేసినట్లు ప్రకటించింది. వెనిజులాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అమెరికా హెచ్చరించిన సమయంలో ఈ నిర్ణయం రావడం విశేషం. గురువారం ప్రసారం చేసిన ముందస్తు రికార్డ్ చేసిన ఇంటర్వ్యూలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మాట్లాడుతూ.. వెనిజులాలో ప్రభుత్వ మార్పుపై ఒత్తిడి తీసుకురావాలని, దేశంలోని విస్తారమైన చమురు నిల్వలను పొందాలని అమెరికా కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
READ ALSO: The Raja Saab Runtime: తగ్గిన ‘ది రాజాసాబ్’.. ఫైనల్ రన్ టైం ఇదే!