Ahmedabad Plane Crash: ఊహాగానాలు వద్దు.. మీడియా కథనాలను తోసిపుచ్చిన అమెరికా దర్యాప్తు సంస్థ
- అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఊహాగానాలు వద్దు
- మీడియా కథనాలను తోసిపుచ్చిన అమెరికా దర్యాప్తు సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటీవల జాతీయ, అంతర్జాతీయ మీడియాలో రకరకాలైన కథనాలు హల్‌చల్ చేశాయి. పైలట్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినట్లుగా కథనాలు వండి వార్చాయి. ఇటీవల విడుదలైన ప్రాథమిక రిపోర్టు ఆధారంగా ఈ ఊహాగానాలు చెలరేగాయి. తాజాగా మీడియాలో వచ్చిన కథనాలను అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు (ఎన్‌టీఎస్‌బీ) చైర్‌పర్సన్ జెన్నిఫర్ హోమెంట్ తోసిపుచ్చారు. అవన్నీ ఊహాజనిత కథనాలేనని స్పష్టం చేశారు. ఇక మీడియా కథనాలను పైలట్ల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తుది నివేదిక రాకుండా కథనాలు ఎలా ప్రసారం చేస్తారంటూ ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: UP: యూపీలో మరో ప్రొఫెసర్ అరాచకం.. డెంటల్ స్టూడెంట్ ఆత్మహత్య
Also Read
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్‌లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్‌న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎన్‌టీఎస్‌బీ సాయంతో భారత విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు కొనసాగిస్తోంది. దర్యాప్తు సమయంలో ఊహాగానాలకు దూరంగా ఉండాలని ఏఏఐబీ, ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్‌బెల్ విల్సన్ ప్రజలను కోరారు. పూర్తి దర్యాప్తునకు ఇంకా సమయం పడుతుందని,. ఏఏఐబీ కొనసాగుతున్న దర్యాప్తుకు మద్దతు ఇస్తున్నట్లు ఎన్‌టీఎస్‌బీ ఎక్స్‌లో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Delhi: ఇద్దరు సీఎంలను అరెస్ట్ చేసిన ఈడీ మాజీ అధికారి రాజీనామా
కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో.. పైలట్‌ల్లో ఒకరు మరొకరిని ఎందుకు కట్-ఆఫ్ చేశావని అడుగుతున్నట్లు వినబడింది. మరొక పైలట్ తాను అలా చేయలేదని ప్రతిస్పందించాడు అని ప్రాథిమక నివేదిక తెలిపింది. అయితే విమానంలో 11A దగ్గర కూర్చున్న ప్రయాణీకుడు విశ్వాష్‌కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు దర్యాప్తు అధికారులతో మాట్లాడుతూ.. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పెద్ద శబ్దం రావడంతో ఆగిపోయిందని చెప్పాడు. ఆకుపచ్చ, తెలుపు లైట్లు మిణుకుమిణుకుమంటున్నాయని పేర్కొన్నాడు. క్రాష్ కాకుండా చూసేందుకు పైలట్లు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లుగా రమేష్ తెలిపాడు. కానీ అంతలోనే కూలిపోయిందని చెప్పాడు. ఇక విమానం కూలిపోక ముందు కేవలం 625 అడుగుల ఎత్తులోనే ఉంది. అదే 3,600–4,900 అడుగుల ఎత్తులో ఉంటే మాత్రం విమానం ప్రమాదానికి గురి కాకుండా నియంత్రించొచ్చు. అందువల్లే పైలట్లకు సాధ్యం కాలేదు.
ఇది కూడా చదవండి: Trump: మాతో జాగ్రత్త.. బ్రిక్స్ దేశాలకు మరోసారి ట్రంప్ హెచ్చరిక
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం లండన్‌కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్‌పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. హాస్టల్‌లో మెడికోలు కూడా చనిపోయారు. ఇలా మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఎయిరిండియా రూ.కోటి పరిహారం అందించింది.
Statement from NTSB Chairwoman Jennifer Homendy:
“Recent media reports on the Air India 171 crash are premature and speculative. India’s Aircraft Accident Investigation Bureau just released its preliminary report. Investigations of this magnitude take time. We fully support the…— NTSB Newsroom (@NTSB_Newsroom) July 18, 2025
తాజావార్తలు
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్‌పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!