Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం వ్యవహారంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అవలంబిస్తున్న కఠిన వైఖరి.. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో ఊహించని భారీ భూకంపానికి దారితీసింది. ఈ కుంభకోణంపై ఏర్పాటైన ప్రత్యేక విచారణ బృందం (SIT) ప్రాథమిక నివేదికలో విరాళాల నిర్వహణ, పర్యవేక్షణలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు తేలడంతో ట్రస్ట్ కీలక సభ్యులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. సీఎం యోగి ఆదేశాలతో దర్యాప్తు ముమ్మరం కావడం, నిందితుల అరెస్ట్‌లతో ఒత్తిడి పెరగడంతోనే వీరు తమ పదవుల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో సిట్ (SIT) సిఫార్సుల మేరకు ఇప్పటికే మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. మాజీ ట్రస్టీ కామేశ్వర్ చౌపాల్ మరణం తర్వాత.. సెప్టెంబర్ 2025లో ఈ బోర్డులోకి వచ్చిన కొత్త ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్ అధికారికంగా ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న మెరుపు నిర్ణయాలు, తాజా రాజీనామాలతో అయోధ్య ట్రస్ట్ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఇక, అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో భక్తుల నమ్మకాలతో, సనాతన ధర్మ విలువలపై ఆటలాడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అత్యంత ఘాటుగా స్పందించారు. ప్రజల విశ్వాసాలను స్వార్థం కోసం వాడుకునే వారి పట్ల తమ ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ (సహించేదే లేదు) విధానాన్ని అవలంబిస్తుందని స్పష్టం చేశారు. ఆలయ విరాళాల హేరఫేరి ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక విచారణ బృందం (SIT) ప్రాథమిక నివేదిక సమర్పించిన వెంటనే ప్రభుత్వం మెరుపు వేగంతో చర్యలు ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లో నమోదైన ఎనిమిది మంది నిందితులను యూపీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రస్టీ కృష్ణ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై దొంగతనం, నేరపూరిత విశ్వాసఘాతుకం, కుట్ర, అవినీతి వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రమాశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామ్ శంకర్ యాదవ్ అలియాస్ తిన్ను అనే ఎనిమిది మందిని కటకటాల్లోకి నెట్టారు. తాజాగా ట్రస్ట్ సభ్యులు రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!