అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటీవల జాతీయ, అంతర్జాతీయ మీడియాలో రకరకాలైన కథనాలు హల్‌చల్ చేశాయి. పైలట్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినట్లుగా కథనాలు వండి వార్చాయి. ఇటీవల విడుదలైన ప్రాథమిక రిపోర్టు ఆధారంగా ఈ ఊహాగానాలు చెలరేగాయి. తాజాగా మీడియాలో వచ్చిన కథనాలను అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు (ఎన్‌టీఎస్‌బీ) చైర్‌పర్సన్ జెన్నిఫర్ హోమెంట్ తోసిపుచ్చారు. అవన్నీ ఊహాజనిత కథనాలేనని స్పష్టం చేశారు. ఇక మీడియా కథనాలను పైలట్ల సంఘాలు తీవ్రంగా…