Women’s World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
- 2026 మహిళల ప్రపంచకప్
- ఆసక్తికరంగా గ్రూప్-A సెమీఫైనల్ పోరు
- భారత్ సెమీఫైనల్ చేరాలంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s World Cup 2026 – India: 2026 మహిళల ప్రపంచకప్‌లో గ్రూప్ A నుండి సెమీఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గ్రూప్ A లోని జట్లన్నీ నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. అయితే ఇందులో ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా జట్లు నాకౌట్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా వరుసగా నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి దాదాపు సెమీఫైనల్ స్థానం ఖాయం చేసుకుంది. మరోవైపు భారత్, దక్షిణాఫ్రికా జట్లు చెరో మూడు విజయాలతో 6 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం భారత్‌కు నెట్ రన్‌రేట్ భారీగా ప్లస్‌లో ఉండటం పెద్ద ఊరటనిచ్చే అంశం. భారత జట్టు నెట్ రన్‌రేట్ +2.268 కాగా, దక్షిణాఫ్రికా +0.734తో ఉంది. దీంతో చివరి మ్యాచ్‌ల ఫలితాలు సెమీస్ అవకాశాలను నిర్ణయించనున్నాయి.
Also Read
- Central Cabinet: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ పంటల మద్దతు ధరలు పెంపు..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
దక్షిణాఫ్రికా ఓడితే భారత్‌కు నేరుగా సెమీస్:
దక్షిణాఫ్రికా తన చివరి లీగ్ మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో అద్భుతం జరిగి బంగ్లాదేశ్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడితే.. భారత్ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా సెమీఫైనల్‌కు చేరుతుంది. దీనికి కారణం.. రెండు జట్లకు 6 పాయింట్లు సమానంగా ఉన్నా, భారత్ నెట్ రన్‌రేట్ చాలా మెరుగ్గా ఉండటం.

దక్షిణాఫ్రికా గెలిస్తే.?
ఒకవేళ దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్‌పై విజయం సాధిస్తే.. ఆ జట్టు 8 పాయింట్లతో ముందుకు వెళ్తుంది. ఈ పరిస్థితిలో భారత్ కూడా ఆస్ట్రేలియాపై తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. భారత్ విజయం సాధిస్తే ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా మూడు జట్లు 8 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. అప్పుడు సెమీఫైనల్‌కు వెళ్లే రెండు జట్లను నెట్ రన్‌రేట్ ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రస్తుతం భారత్ రన్‌రేట్ దక్షిణాఫ్రికా కంటే చాలా మెరుగ్గా ఉండటంతో టాప్-2లో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఓడితే టోర్నీకి గుడ్‌బై:
భారత్ తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి, అదే సమయంలో దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్‌పై గెలిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అప్పుడు దక్షిణాఫ్రికా 8 పాయింట్లతో సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే.. భారత్ 6 పాయింట్లతోనే నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.
కీలకంగా ఆస్ట్రేలియా మ్యాచ్:
మొత్తానికి భారత మహిళల జట్టుకు ఆస్ట్రేలియాతో జరిగే చివరి లీగ్ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. నెట్ రన్‌రేట్ పరంగా భారత్ బలంగా ఉన్నప్పటికీ.. సెమీఫైనల్ బెర్త్‌పై ఎలాంటి సందేహాలు లేకుండా ముందుకు వెళ్లాలంటే ఆస్ట్రేలియాపై విజయం సాధించడమే ఉత్తమ మార్గం.
తాజావార్తలు
-
Central Cabinet: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ పంటల మద్దతు ధరలు పెంపు..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!