Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- భారత్‌లో అపూర్వ స్వాగతంతో మెలోని షాక్..
- ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు వస్తాయన్న ఇటలీ ఉప ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Giorgia Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తనకు భారత పర్యటనలో లభించిన అపూర్వ స్వాగతం గురించి గుర్తు చేసుకున్నారు. 2023 భారత పర్యటనకు వెళ్లినప్పుడు న్యూఢిల్లీలో వీధులన్నీ తన ఫోటోలతో, స్వాగత సందేశాలతో నిండిపోయాయని, తిరిగి వెళ్లే సమయంలో అదే పోస్టర్లపై ‘‘వచ్చినందుకు ధన్యవాదాలు’’ అనే సందేశాలు కనిపించాయని ఆమె తెలిపారు. జర్నలిస్ట్ అలెశాండ్రో సలుస్తి, మెలోనితో జరిగిన సంభాషణల్ని ‘‘జియోర్జియాస్ విజన్’’ పుస్తకంలో ప్రస్తావించారు.
ఆ సమయంలో ఇటలీ ఉప ప్రధానిగా ఉన్న ఆంటోనియో తజానీ, ఈ స్వాగతం గురించి మాట్లాడుతూ.. ‘‘మీరు న్యూఢిల్లీలో నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తే లక్షలాది ఓట్లు వచ్చేవి’’ అని సరదాగా వ్యాఖ్యానించినట్లు మెలోని వెల్లడించారు. మెలోనీ 2023లో రెండుసార్లు భారత పర్యటనకు వచ్చారు. మార్చిలో జరిగిన రైసినా డైలాగ్ సమావేశంలో పాల్గొనగా, సెప్టెంబర్‌లో జీ20 సదస్సు కోసం మళ్లీ భారత్ వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీతో మంచి అనుబంధం ఏర్పడింది.
Also Read
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
- Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
- FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
మోడీ-మెలోనీ కలిస్తే ఇంటర్నెట్లో వీరిద్దరి ఫోటోలు వైరల్ కావడం, ‘‘మెలోడీ’’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ కావడం చూస్తున్నాం. ఇటీవల ప్రధాని ఇటలీ పర్యటనలో జార్జియా మెలోనీకి మోడీ ‘‘మెలోడీ’’ చాక్లెట్లు బహూకరించారు. మెలోడీ, మోడీ కలిసి ఒకరినొకరు అభినందించుకుంటున్న వీడియో కూడా వైరల్ అయింది.
తాజావార్తలు
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?