కోవిడ్ సెకండ్ వేవ్‌తో అల్లాడుతోన్న భారత్‌ను ఆదుకోవడానికి క్రమంగా కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి.. తోచిన సాయాన్ని చేస్తున్నాయి.. ఇక, ఇప్పటికే గూగుల్, అమెజాన్ ఇండియా లాంటి చాలా సంస్థలు భారీ సాయాన్ని ప్రకటించాయి. ఇందులో భాగంగానే అమెరికా కూడా ఇండియాకు ఆర్థిక సాయం అందిస్తోంది. కరోనా పోరులో ఇప్పటి వరకు ఇండియాకు 500 మిలియన్ డాలర్ల సాయం చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. 80 మిలియన్ల వ్యాక్సిన్లను ఇతర దేశాలకు పంపిణి చేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది అమెరికా. ఇండియాకు 500 మిలియన్ డాలర్ల కోవిడ్ సాయాన్ని అమెరికా ప్రభుత్వం అందించింది. ఈ మేరకు శ్వేతపత్రం విడుదల చేసింది వైట్ హౌస్. అలాగే కరోనా మహమ్మారి ప్రభావంతో బాధపడుతున్న ఇతర దక్షిణాసియా దేశాలకు కూడా సహాయాన్ని అందించడానికి బైడెన్ యంత్రాంగం ఇప్పుడు కృషి చేస్తోందని జెన్ సాకి వైట్ పేర్కొన్నారు.