అగ్ర రాజ్యం అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైళ్లను విడుదల చేసే బిల్లుకు అమెరికా చట్టసభ సభ్యులు ఆమోదించారు. 427-1 తేడాతో బిల్లు ఆమోదం పొందింది. ట్రంప్‌కు తీవ్రమైన మద్దతుదారుడు.. లూసియానా రిపబ్లికన్ ప్రతినిధి క్లే హిగ్గిన్స్ మాత్రమే ఓటు వేయలేదు.