India China: చైనా తన బుద్ధిని చూపిస్తూనే ఉంది. ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్‌తో పాటు కరుడుగట్టిన ఉగ్రవాదులపై ఆంక్షలు కోసం భారత్ చేస్తున్న అభ్యర్థనను చైనా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన ఐదుగురు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్ (జెఎం) ఉగ్రవాదులను నిషేధించి,
Pakistan: పాకిస్తాన్‌లో మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు యాక్టివ్ అయిపోయారు. ఇప్పటికే పలువురు భారత్ వ్యతిరేక టెర్రరిస్టుల్ని హతమారుస్తున్న వీరు, తాజాగా లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్‌ని హతమార్చారు. పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ లో ఇతడిని హతమార్చారు. భారత్‌లో సైఫుల్లా అనేక హై ప్రొఫైల్ ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు. మూడు ప్రధాన దాడుల్లో ఖలీద్ కీలక కుట్రదారుగా ఉన్నాడు.
Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడింది తామే అని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ది రెసిస్టె్న్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించింది. అయితే, పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులే, 2024లో జరిగిన Z-మోర్హ్ టన్నెల్ ప్రాజెక్ట్‌పై దాడికి పాల్పడినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
Hafiz Saeed: భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్(LeT) చీఫ్, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కి పాకస్తాన్ భారీ ఎత్తున భద్రత కల్పిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడింది లష్కరే ప్రాక్సీ అయిన ‘‘ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులే. పహల్గామ్ దాడి తర్వాత భారత టార్గెట్‌లో ఖచ్చితంగా హఫీస్ సయీద్ ఉన్నాడని తెలిసి పాకిస్తాన్ ప్రభుత్వం, ఐఎస్ఐ అతడికి హై లెవల్ సెక్యూరిటీని కల్పించినట్లు తెలుస్తోంది.
Jammu Kashmir: పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత నుంచి భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్‌ని జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా(LeT)తో సంబంధం ఉన్న ముగ్గరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. గురువారం జమ్మూ కాశ్మీర్‌లోని బండిపోరాలోని చెక్‌పాయింట్ వద్ద వీరిని అరెస్ట్ చేశారు. గరూరా హాజిన్ ప్రాంతంలో ఉగ్రవాదుల నుండి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక చైనీస్ పిస్టల్,…
26/11 Mumbai Attack: 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, లష్కరే తోయిబా(LeT) ఉగ్రసంస్థ టెర్రిరిస్ట్ ఆజం చీమా(70) పాకిస్తాన్‌లో మరణించినట్లు తెలుస్తోంది. 2008లో ముంబైపై ఉగ్రదాడిలో ఇతను కీలకంగా వ్యవహిరంచాడు. 70 ఏళ్ల వయసులో పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో గుండె పోటుతో మరనించాడు. లష్కరే తోయిబా సీనియర్ కమాండర్‌గా ఉన్న చీమా 26/11 ముంబై ఎటాక్స్, జూలై 2006లో ముంబైలో జరిగిన రైలు బాంబు పేలుళ్లలో కీలక నిందితుడు.
1993 Train blasts: 1993 రైలు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లష్కర్ తోయిబా ఉగ్ర సంస్థ బాంబు తయారీదారు అబ్దుల్ కరీం తుండాను రాజస్థాన్ ప్రత్యేక కోర్టు నేడు నిర్దోషిగా ప్రకటించింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత గడిచి సంవత్సరం పూర్తి అయిన సందర్భంలో పలు రైళ్లలో పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ఇద్దరు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. అయితే, తుండాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని పేర్కొన్న కోర్టు, ఇద్దరు నిందితులు అమీనుద్దీన్,…
26/11 Mumbai Attacks: 26/11 ముంబై దాడులకు ఈ నెలతో 15 ఏళ్లు కావస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ ‘లష్కరే తోయిబా’ ఉగ్రవాదులు ముంబై నగరంపై దారుణమైన దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే లష్కరే తోయిబాను ఇజ్రాయిల్ ఈ రోజు ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటించింది. దీనిని ఘోరమైన ఖండించదగిన సంస్థగా పేర్కొంది. భారతదేశం నుంచి ఎలాంటి అభ్యర్థన లేనప్పటికీ ఇజ్రాయిల్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
Pakistan: పాకిస్తాన్‌లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా మరో ఇద్దరు భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. నిషేధిత లష్కరే తోయిబాకు చెందిన మహ్మద్ ముజామిల్, నయీమూర్ రెహ్మన్‌లను సియాల్‌కోట్ నగరంలో హతమార్చారు. పోలీస్ యూనిఫాం ధరించిన ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి కాల్చి చంపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దర్ని…