Ukraine Crisis: ఉక్రెయిన్ ఎదురుదాడి.. రష్యా ఫైటర్ జెట్స్ కూల్చివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ కూడా ఎదురుదాడికి దిగింది. తమ దేశంలోని ప్రవేశించి దాడులకు దిగుతున్న రష్యా జెట్ ఫైటర్‌ను ఉక్రెయిన్ కూల్చివేసింది. ఈ మేరకు ఐదు రష్యా ఎయిర్‌క్రాఫ్ట్, జెట్లు, హెలికాప్టర్లను కూల్చేశామని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. తమ దేశ భద్రత కోసం సైనికులు పూర్థి స్థాయిలో పోరాడతారని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు రష్యా బలగాలు ఎయిర్ స్ట్రైక్స్‌తో పాటు మిస్సైల్స్‌తో ఉక్రెయిన్‌పై అటాక్ చేస్తున్నాయి. ఎయిర్ డిఫెన్స్ కెపాసిటీని కూల్చేశామని రష్యా తెలిపింది. ఆ దేశ సరిహద్దుల్లో సుమారు 1.50 లక్షల మంది సైనికులు మోహరించారు. మరోవైపు బెలారస్ సైనికులు కూడా రష్యా దళాలతో చేరారు.
ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతామండలి మరోసారి అత్యవసరంగా సమావేశమైంది. సైనిక మోహరింపు, తదితర పరిణామాలపై ఈ సమావేశంలో చర్చ సాగింది. యుద్ధ పరిణామాలు ఉక్రెయిన్‌కు వినాశకరమని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా దూరం అవుతాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. మానవతా దృక్పథంతో యుద్ధాన్ని ఆపాలని రష్యాను ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై రష్యా దాడి నేపథ్యంలో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు దేశాన్ని విడిచి వెళ్తున్నారు. పెద్ద సంఖ్యలో కార్లలో బయలుదేరిన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. దీంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధానంగా రాజధాని కీవ్‌ను విడిచి ప్రజలు పారిపోతున్నారు. ఉక్రెయిన్‌లో ప్రముఖులు, రాజకీయ నాయకులు బంకర్లలో తలదాచుకొని ప్రాణాలు రక్షించుకుంటున్నారు
Also Read
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
తాజావార్తలు
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
-
SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
-
RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..