Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- ఏఐ దుర్వినియోగం, అణుయుద్ధంతో మానవాళికి ముప్పు..
- 2100 నాటికి మానవజాతి అంతరించే ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lancet Report: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) దుర్వినియోగం, అణుయుద్ధం, జీవ ఆయుధాల వినియోగంతో మానవాళి అంతమయ్యే ప్రమాదం ఉందని ది లాన్సెట్‌లో ప్రచురితమైన కొత్త నివేదిక వెల్లడించింది. ఈ ముప్పులు తీవ్ర రూపం దాలిస్తే 2100 నాటికి మానవజాతి అంతరించే పరిస్థితి ఏర్పడుతుందని నివేదిక పేర్కొంది. దీనికి అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెప్పింది. ‘‘లాన్సెట్ కమిషన్ ఆన్ 21st సెంచరీ గ్లోబల్ థ్రెట్స్ టు హెల్త్’’ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. ఈ కమిషన్‌లో 35 మంది నిపుణులు సభ్యులుగా ఉన్నారు. వారి పరిశోధన ఫలితాలను జర్మనీలోని బెర్లిన్‌లో జరిగే వరల్డ్ హెల్త్ సమ్మిట్‌లో సమర్పించనున్నారు.
రాబోయే 70 ఏళ్లలో ప్రపంచ ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేయగలిగే 17 ప్రధాన ముప్పులను గుర్తించాయి. వీటిలో అణుయుద్ధం, ఏఐ దుర్వినియోగం, వాతావరణ మార్పులు, వాయుకాలుష్యం, చిన్నారుల్లో పోషకాహార లోపం, ఊబకాయం వంటివి ఉన్నాయి. ఈ ముప్పులన్నీ ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయని, వీటిని విడివిడిగా కాకుండా సమగ్రంగా ఎదుర్కోవాలని నివేదిక సూచించింది. ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటే రాబోయే తరాలను ముప్పు నుంచి కాపాడుకోవచ్చని తెలిపింది.
Also Read
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
AIతో జీవ ఆయుధాల తయారీతో తీవ్ర ముప్పు..
AIని దుర్వినియోగం చేసి జీవ ఆయుధాలను అభివృద్ధి చేసే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. ఇలాంటి ఆయుధాలు లక్షలాది మంది ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. ఏఐని హానికర ప్రయోజనాలకు ఉపయోగించడం, అణు ఘర్షణలు కరువుకు కారణం కావడం వంటివి రాబోయే 75 ఏళ్లలో మానవజాతి అంతరించేపోయే ప్రమాదాలను పెంచుతాయని పేర్కొంది.
మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 15 ముప్పులు..
అణుయుద్ధం, ఏఐ దుర్వినియోగంతో పాటు మరో 15 ప్రధాన ప్రమాదాలను కమిషన్ గుర్తించింది. వీటిలో… వాతావరణ కాలుస్యం, వాతావరణ మార్పులు, యాంటిమైక్రోబియల్ రెసిస్టెన్స్, చిన్నారుల్లో పోషకాహార లోపం, సంప్రదాయ యుద్ధాలు, అంతర్జాతీయ ఆరోగ్య సహాయంలో కోతలు, అధిక మద్యపానం, ఆదాయ అసమానతలు, విద్యాస్థాయిల లోపం, సహజంగా వ్యాపించే మహమ్మారులు, ఊబకాయం, మానసిక ఆరోగ్యం, ధూమపానం, ఆరోగ్యకరంగా వృద్ధాప్యంలోకి వెళ్లలేకపోవడం వంటివి ఉన్నాయి.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..