CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన భారీ నిరసనల సమయంలో ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడంపై ఐక్యరాజ్యసమితి (UN) మానవ హక్కుల కార్యాలయం చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఇవి పూర్తిగా అవాస్తవమని, మా దేశ అంతర్గత విషయాల్లో అనవసర జోక్యం చేసుకోవడమేనని స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగిన ఆందోళనలు, నిరసనకారులు, లీడర్లు, సివిల్ సొసైటీ సభ్యులు, లాయర్లు, జర్నలిస్టులను ముందస్తుగా, ఆందోళనల సమయంలో అరెస్ట్ చేశారంటూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం (OHCHR) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కామెంట్స్‌పై జెనీవాలోని ఐరాసలో భారత్ పర్మినెంట్ మిషన్ ఎక్స్ (X) వేదికగా కౌంటర్ ఇచ్చింది. మా దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రజలకు శాంతియుత నిరసనలు తెలిపే హక్కు ఉందని, స్వతంత్ర న్యాయవ్యవస్థ, ఫ్రీ మీడియా, బలమైన వ్యవస్థల ద్వారా ఆ హక్కుకు పూర్తి రక్షణ ఉందని తేల్చి చెప్పింది. ఐరాస ఆందోళనలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని, భారత్ అంతర్గత వ్యవహారాల్లో అనవసర జోక్యమని కౌంటర్ ఇచ్చింది. అంతేకాదు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పెద్ద ఎత్తున నిరసనల పట్ల కూడా ఐరాస ఇలాగే శ్రద్ధ పెట్టాలని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే తమ మ్యాండేట్‌ను గుర్తుంచుకోవాలని భారత్ స్పష్టం చేసింది.
మన దేశ ప్రజాస్వామ్య విలువలను గుర్తుచేస్తూ.. ప్రజలకు శాంతియుత నిరసనలు తెలిపే హక్కు ఉందని, అయితే ప్రజాభద్రతను దృష్టిలో ఉంచుకుని చట్టప్రకారం కొన్ని సహేతుకమైన ఆంక్షలు ఉంటాయని భారత్ స్పష్టం చేసింది. అక్కడి అధికార యంత్రాంగం చట్టాలకు లోబడే నడుచుకుంటుందని, ఎవరికైనా ఎలాంటి సమస్యలు వస్తే ఆశ్రయించడానికి మన కోర్టులు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయని తెలిపింది. మా దేశంలోని రాజ్యాంగ భద్రతలు, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్, జ్యుడీషియల్ పద్ధతులు పౌరుల సమస్యల పరిష్కారానికి సరైన మార్గాలను చూపుతాయని భారత్ వెల్లడించింది.
Also Read
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
అంతకుముందు, ఐరాస హ్యూమన్ రైట్స్ స్పోక్స్‌పర్సన్ తమీమ్ అల్-ఖెతాన్ మాట్లాడుతూ.. ఢిల్లీ నిరసనలకు సంబంధించి పెద్ద ఎత్తున జరిపిన అరెస్ట్‌లపై ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం (OHCHR) ఆందోళన చెందుతోందని చెప్పారు. శాంతియుత నిరసన తెలిపే హక్కుకు ఎలాంటి భంగం కలగకుండా అధికారులు చూడాలని పిలుపునిచ్చారు. శాంతియుత ఆంక్షలపై విధించే నిబంధనలు ఖచ్చితంగా అవసరమైనవిగా, తగిన మోతాదులో ఉండాలని స్పష్టం చేశారు. ఆందోళనకారులను ఎదుర్కొనేటప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అత్యంత సంయమనం పాటించాలని సూచించారు. అక్రమంగా అదుపులోకి తీసుకున్న వారందరినీ వెంటనే, బేషరతుగా విడుదల చేయాలని.. నిరసనకారులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించుకోవడానికి భారత అధికారులు వాళ్లతో అర్థవంతమైన చర్చలు జరపాలని ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం (OHCHR) కోరింది.
తాజావార్తలు
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!