ఉక్రెయిన్‌పై రష్యా దాడి రెండో నెలలోకి ప్రవేశించింది. ఐదు వారాలుగా ఎడతెరపి లేకుండా సాగుతున్న దాడులకు ఉక్రెయిన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటం పెద్ద కష్టం కాదు. జరుగుతున్న రక్తపాతానికి ఉక్రెయిన్ ప్రజలు హడలిపోతున్నారు. పిల్లలకు స్కూళ్లు లేవు. వైద్యం లేదు. ముఖ్యంగా వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో ఏ ప్రాంతం కూడా సురక్షితం అని చెప్పలేని పరిస్థితి నెలకొంది. రాజధాని కీవ్‌లో దాదాపు కోటి మంది సురక్షిత ప్రాంతాలను వెతుక్కోవటానికి ఇల్లు వీడి వెళ్లిపోయారు.…
రష్యా దాడులతో ఉక్రెయిన్ విలవిల్లాడుతోంది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై క్షిపణి దాడులతో రష్యా బలగాలు మారణహోమం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మేరియుపోల్ నగరంలో పరిస్థితులు దారుణంగా మారాయి. అక్కడ శవాల గుట్టలు అంతకంతకూ పేరుకుపోతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 2,500 మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు ఒలెక్సీ అరిస్టోవిచ్ వెల్లడించారు. మేరియుపోల్‌కు చేరుకునే మానవతా సాయాన్ని కూడా రష్యా అడ్డుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన రెండు రోజుల్లోనే మరణాల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పారు. రష్యా దాడులు…
ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ నోటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాట ‘నో ఫ్లై జోన్’. రష్యా దాడులు ఉధృతం కావటంతో తమ గగన తలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని ఆయన నాటో కూటమికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాడు. అయితే అమెరికా, పశ్చిమ దేశాలు అందుకు ఒప్పుకోవటం లేదు. నోఫ్లై జోన్ ప్రకటన అంటే రష్యా విమానాలను కూల్చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే. రష్యాతో ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్టే. అప్పుడు పరిస్థితి ఇప్పటికన్నా…
ఒక పథకం, షెడ్యూల్ ప్రకారం ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతుందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. పోరాటం ఆపి లొంగిపోయే వరకు, తమ డిమాండ్లు నెరవేరే వరకు యుద్ధం కొనసాగిస్తామని ఉక్రెయిన్‌ను ఉద్దేశించి హెచ్చరించారు. మూడో దఫా జరిగే శాంతి చర్చల్లో నిర్మాణాత్మక విధానాన్ని అవలంభించడం మంచిదని ఉక్రెయిన్‌కు పుతిన్ సూచించారు. కాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం సుదీర్ఘంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టి పది రోజులైంది. పుతిన్ బలగాలను ఉక్రెయిన్ సైన్యం, పౌరులు కలిసికట్టుగా ఎదిరిస్తున్నారు. అయినా ప్రత్యర్థి దేశంలోని ఒక్కో నగరాన్ని, పట్టణాన్ని వ్యూహాత్మక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ఇంకా అమెరికా, నాటోపై ఆశ చావలేదు. ఓ వైపు ఉక్రెయిన్‌లో యుద్ధ బీభత్సం సృష్టిస్తూనే రష్యా మరోపక్క చర్చలు జపం చేస్తోంది. రష్యా చర్యను ఇప్పటికే మెజార్టీ దేశాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఐక్యరాజ్య సమితి వేధికగా దాడిని…
ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతో పాటు సాధారణ ప్రజలు కూడా మరణిస్తున్నారు. ఇరు దేశాల యుద్ధం ప్రారంభమై మంగళవారం నాటికి ఆరు రోజులు అవుతోంది. రోజురోజుకు యుద్ధం తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడుల్లో భారత్‌కు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. రెండో అతిపెద్ద నగరమైన ఖర్కీవ్‌లో రష్యా మిస్సైల్ దాడిలో కర్ణాటకకు చెందిన మెడికల్ విద్యార్థి నవీన్ మరణించాడు. భారత విద్యార్థి నవీన్ ఆహారం…
ఉక్రెయిన్‌పై రష్యా భీకర రీతిలో యుద్ధం చేస్తోంది. ఈ కారణంగా ఉక్రెయిన్‌లో భయానక వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ చదువుతున్న భారతీయ విద్యార్థులందరూ స్వదేశానికి వచ్చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే కొంతమంది భారతీయులు ఇంకా అక్కడే చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు సురక్షితంగా తిరిగొస్తాడో, లేదో అనే ఒత్తిడిని తట్టుకోలేక ఓ తల్లి ప్రాణం విడిచింది. తమిళనాడు తిరుపత్తూరుకు చెందిన శక్తివేల్ ఉక్రెయిన్ లో చదువుకుంటున్నాడు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి…
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరేలా కనిపిస్తోంది. వరుసగా మూడోరోజు కూడా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై బాంబుల దాడి సాగుతోంది. రష్యా సైనికుల బాంబు దాడుల నుంచి ప్రాణాలతో బయటపడేందుకు కీవ్ నగరంలో స్థానికులు అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో తలదాచుకుంటున్నారు. ఆ మెట్రో స్టేషన్లే ఇప్పుడు బాంబు షెల్టర్లు. అక్కడ తలదాచుకుంటున్న ఓ గర్భిణి ప్రసవించింది. బేబీకి జన్మనిచ్చిన విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా మెట్రో స్టేషన్‌లనే బంకర్లుగా…
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ కూడా ఎదురుదాడికి దిగింది. తమ దేశంలోని ప్రవేశించి దాడులకు దిగుతున్న రష్యా జెట్ ఫైటర్‌ను ఉక్రెయిన్ కూల్చివేసింది. ఈ మేరకు ఐదు రష్యా ఎయిర్‌క్రాఫ్ట్, జెట్లు, హెలికాప్టర్లను కూల్చేశామని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. తమ దేశ భద్రత కోసం సైనికులు పూర్థి స్థాయిలో పోరాడతారని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు రష్యా బలగాలు ఎయిర్ స్ట్రైక్స్‌తో పాటు మిస్సైల్స్‌తో ఉక్రెయిన్‌పై అటాక్ చేస్తున్నాయి. ఎయిర్ డిఫెన్స్ కెపాసిటీని కూల్చేశామని రష్యా తెలిపింది.…