Earthquake in Russia: రష్యాతీరంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 8.7 తీవ్రత.. సునామీ హెచ్చరిక జారీ
- రష్యాతీరంలో భారీ భూకంపం
- రిక్టర్ స్కేలుపై 8.7 తీవ్రత
- సునామీ హెచ్చరిక జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యాలోని ఫార్ ఈస్టర్న్ ప్రాంతమైన కమ్చట్కాలో తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.7గా నమోదైంది. యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) ప్రకారం, సముద్రం లోతులో భూకంపం సంభవించింది. ఆ తర్వాత జపాన్, యుఎస్ ఏజెన్సీలు సునామీ హెచ్చరిక (సునామీ వాచ్) జారీ చేశాయి. యుఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, భూకంపం లోతులో (సుమారు 19.3 కిలోమీటర్లు) సంభవించింది. దీని వలన ఉపరితలంపై బలమైన ప్రకంపనలు, సునామీ వచ్చే అవకాశం పెరిగింది.వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, 0100 GMT (భారత కాలమానం ప్రకారం ఉదయం 6:30) తర్వాత 1 మీటర్ (సుమారు 3.28 అడుగులు) ఎత్తు వరకు అలలు జపాన్ తీర ప్రాంతాలకు చేరుకోవచ్చని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
Also Read:Nidhi Agarwal : పరువాల ‘నిధి’అగర్వాల్..
Also Read
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్‌కు మరో మంత్రి పదవి ఆఫర్! బీజేపీ క్లారిటీ
- ROKO: రోహిత్, కోహ్లీలపై షాకింగ్ కామెంట్స్ చేసిన పాక్ దిగ్గజం... 2027 వరల్డ్ కప్‌లో అసలు ఏం జరగబోతోంది..?
- Rohit Sharma: బట్లర్ కోరిక తీర్చిన రోహిత్ శర్మ.. ప్రత్యేక సందేశంతో హిట్ మ్యాన్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇదే..
- CM Chandrababu: అమరావతి అంటే 29 గ్రామాలే కాదు.. విజయవాడ-గుంటూరుతో కలిసి అభివృద్ధి..
జపాన్ ప్రధాన మంత్రి షిగేరు ఇషిబాకు పరిస్థితి గురించి సమాచారం అందించారు అధికారులు. ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి సహాయ చర్యలకు సన్నాహాలు ప్రారంభించింది. జూలై ప్రారంభంలో, కమ్చట్కా సమీపంలోని సముద్రంలో అనేక భూకంపాలు సంభవించాయి. వాటిలో ఒకటి 7.4 తీవ్రతతో నమోదైంది. అదే సమయంలో, రాబోయే మూడు గంటల్లో రష్యా, జపాన్‌లోని కొన్ని ప్రాంతాలకు ప్రమాదకరమైన సునామీ తరంగాలు చేరుకోవచ్చని అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది.
Also Read:Prakasam Barrage: అలర్ట్.. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద.. పరివాహక ప్రాంతాలకు హెచ్చరిక
దీనితో పాటు, ఫిలిప్పీన్స్, మార్షల్ దీవులు, పలావ్ మరియు, దీవులకు కూడా తేలికపాటి తరంగాలు చేరుకునే అవకాశం ఉంది. రష్యా ప్రాంతీయ గవర్నర్ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదని, కానీ ఒక కిండర్ గార్టెన్ దెబ్బతిన్నదని అన్నారు. ఈ భూకంపాన్ని దశాబ్దాలలో అత్యంత శక్తివంతమైన భూకంపంగా ఆయన అభివర్ణించారు, తీరప్రాంతాల్లో నివసించే వారు వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని కోరారు.భూకంపం, సునామీ ముప్పు తర్వాత, రష్యాలోని సఖాలిన్ ప్రాంతంలోని సెవెరో-కురిల్స్క్ అనే చిన్న పట్టణం నుంచి ప్రజలను తరలిస్తున్నారు కొనసాగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సూచనలను పాటించాలని, పుకార్లకు దూరంగా ఉండాలని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు.
❗️FIRST pic of a kindergarten in Russia after walls COLLAPSED from earthquake
There were no children inside, everyone was able to evacuate in time https://t.co/mEmIhVlr3c pic.twitter.com/SS7XRq1lFM
— RT (@RT_com) July 30, 2025
తాజావార్తలు
-
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్‌కు మరో మంత్రి పదవి ఆఫర్! బీజేపీ క్లారిటీ
-
China: మళ్లీ కరోనా కలకలం.. చైనాలో 79 వేల కొత్త కేసులు.. భారత్‌కు డేంజరేనా?
-
ROKO: రోహిత్, కోహ్లీలపై షాకింగ్ కామెంట్స్ చేసిన పాక్ దిగ్గజం… 2027 వరల్డ్ కప్‌లో అసలు ఏం జరగబోతోంది..?
-
Plastic Notes: దేశ కరెన్సీ చరిత్రలో మరో కీలక మార్పు.. ప్లాస్టిక్ నోట్ల ఎంట్రీకి రంగం సిద్ధం!
-
Rohit Sharma: బట్లర్ కోరిక తీర్చిన రోహిత్ శర్మ.. ప్రత్యేక సందేశంతో హిట్ మ్యాన్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇదే..
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!