Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Trump Warns Jordan Egypt

Trump: జోర్డాన్, ఈజిప్ట్‌లకు ట్రంప్ హెచ్చరిక.. పాలస్తీనియన్లను చేర్చుకోకపోతే..!

Published Date :February 11, 2025 , 12:46 pm
By Suresh Maddala
  • గాజాను స్వాధీనం చేసుకుంటున్నాం
  • పాలస్తీనియన్లను శాశ్వతంగా చేర్చుకోండి
  • మిత్రదేశాలైన జోర్డాన్, ఈజిప్ట్‌లకు ట్రంప్ హెచ్చరిక
  • లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్
Trump: జోర్డాన్, ఈజిప్ట్‌లకు ట్రంప్ హెచ్చరిక.. పాలస్తీనియన్లను చేర్చుకోకపోతే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హమాస్-లెబనాన్-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది. ఇక ఈ మధ్య కాలంలోనే హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి.. ఇరు పక్షాలు బందీలు విడుదల చేయడం.. ఖైదీలను అప్పగించుకోవడం జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు గాజాను స్వాధీనం చేసుకుంటామని.. పాలస్తీనియులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అంతేకాదు.. శనివారంలోగా ఒకేసారి ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయకపోతే.. హమాస్ నరకం చూస్తుందని తీవ్ర వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Stock Market Trading Scam: స్టాక్ మార్కెట్‌ పేరుతో భారీ మోసం.. కోట్ల రూపాయలు లాగేశారు.. కానిస్టేబుళ్ల కీలక పాత్ర..!

ఇదిలా ఉంటే తాజాగా ట్రంప్.. జోర్డాన్, ఈజిప్ట్‌లకు హెచ్చరికలు జారీ చేశారు. గాజా నుంచి వచ్చే పాలస్తీనియన్లను చేర్చుకోవాలన్నారు. లేదంటే సాయం నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించారు. గాజాను తిరిగి అభివృద్ధి చేస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అక్కడ ప్రజలను మిత్రదేశాలైన జోర్డాన్, ఈజిప్ట్‌లు చేర్చుకోవాలని ట్రంప్ సూచించారు. ఈ నేపథ్యంలో మంగళవారం జోర్డాన్ రాజు అబ్దుల్లాతో ట్రంప్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా జోర్డాన్ రాజుపై ట్రంప్ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే గాజా నుంచి వచ్చే పాలస్తీనియన్లను శాశ్వతంగా తీసుకోవాలని జోర్డాన్, ఈజిప్టులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ప్రతిపాదన తిరస్కరిస్తే మాత్రం.. సహాయాన్ని నిలిపివేయనున్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

ఇది కూడా చదవండి: Nani: నాని ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ రెడీ..!

ప్రస్తుతం అమెరికా నుంచి జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు సైనిక మరియు ఆర్థిక సహాయాన్ని పొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గాజాను స్వాధీనం చేసుకుంటే.. ఈ పాలస్తీనియన్లను మిత్ర దేశాలైన జోర్డాన్, ఈజిప్ట్‌ దేశాలకు తరలించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆ రెండు దేశాలు అంగీకరించకపోతే మాత్రం సాయం నిలిపివేసేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే ట్రంప్ ప్రతిపాదనకు ఆ రెండు దేశాలు సిద్ధంగా లేవన్నట్టుగా తెలుస్తోంది. ట్రంప్ ప్రతిపాదనను జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు తిరస్కరించనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ట్రంప్ ఆలోచన విధానాన్ని ప్రపంచ దేశాలు తప్పుపడుతున్నాయి. మరోసారి ఉద్రిక్తతలు సృష్టించేవిగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: మరో ఘోరం.. బస్సు-ట్రక్కు ఢీ.. ఏడుగురు భక్తులు మృతి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Egypt
  • GAZA
  • Hamas
  • Israel
  • jordan

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions