టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ప్రజంట్ బ్యాక్ టై బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్‌లో ‘హిట్-3’ సినిమా తెరకెక్కిస్తున్న నాని,‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ‘ది ప్యారడైజ్’ అనే మూవీని అనౌన్స్ చేశాడు.ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సాహు గారపాటి షైన్స్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేయనున్నారు. తాజాగా ఇప్పుడు ఈ ‘ది ప్యారడైజ్’ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో వైరల్ అవుతుంది. ఏంటీ అంటే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను నాని రెడీ చేశాడట కానీ..
Also Read:Kannappa: ‘కన్నప్ప’ నుండి శివ శివ శంకర.. ఫస్ట్ సాంగ్ వచ్చేసింది
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ వర్క్ కంప్లీట్ చేస్తే ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు శ్రీకాంత్ ఓదెల రెడీగా ఉన్నాడట. అంతేకాదు అని అనుకున్నసమయానికి అనుకున్నట్లుగా జరిగితే ఈ గ్లింప్స్‌ను ఫిబ్రవరి 20న రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక నాని హీరోగానే కాదు నిర్మాతగా కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు.
ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను వంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్‌ని పరిచయం చేసింది నానినే. ఇక అలాగే శ్రీకాంత్ ఓదెలని డైరెక్టర్‌గా పెట్టి చిరంజీవితో కూడా ఓ సినిమా నిర్మించబోతున్నాడు నాని. మరో పక్క ప్రియదర్శిని హీరోగా పెట్టి ‘కోర్ట్’ అనే మూవీ చేశాడు. మొత్తంగా నాని అని రంగాల్లో తన సక్సెస్ తో ముందుకు సాగుతున్నారు.