Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ilhan Omar: అమెరికా డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎంపీ ఇల్హాన్ ఒమర్ చిక్కుల్లో పడింది. వివాదాలకు కేరాఫ్‌గా ఉండే ఒమర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ఆమెపై వచ్చని నకిలీ వివాహం ఆరోపణలను ఫెడరల్ దర్యాప్తు సంస్థలు మరోసారి దర్యాప్తు చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ వ్యవహారంలో విచారణ జరిగినప్పటికీ, చట్టపరమైన గడువు ముగియడంతో అప్పట్లో తీవ్రమైన క్రిమినల్ అభియోగాలు నమోదు కాలేదు.
సొంత సోదరుడితో వివాహం..?
సోమాలియా మూలాలు ఉన్న ఇల్హాన్ ఒమర్ తన సోదరుడిగా చెప్పబడుతున్న అహ్మద్ నూర్ సయీద్ ఎల్మీని పెళ్లి చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె అమెరికా పౌరసత్వం, గ్రీన్ కార్డ్ పొందేందుకు వీలుగా ఈ వివాహం చేసుకున్నారనేది ప్రధాన ఆరోపణ. అయితే, ఈ ఆరోపణల్ని ఒమర్ చాలా సందర్భాల్లో ఖండించారు.
Also Read
- Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
- ChatGPT: ప్రాణాలు తీసిన ChatGPT వైద్యం.. మూర్ఛ వ్యాధితో మహిళ మృతి.. ఓపెన్ఏఐపై దావా..
- Bangladesh: హసీనా ప్రభుత్వం కూలకముందే యూనస్‌తో చర్చలు.. పక్కా ప్లాన్‌తో రెజిమ్ ఛేంజ్?
- Flavio Bolsonaro: అమెరికాకు పారిపోయిన బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి.. లూలా గెలుపు తర్వాత కీలక పరిణామం!
ఈ వివాదంపై 2016లో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విచారణ జరిగింది. అప్పటి దర్యాప్తులో అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చినట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ, ఐదేళ్ల చట్టపరమైన గడువు ముగియడంతో తీవ్రమైన క్రిమినల్ అభియోగాలు నమోదు చేయలేకపోయారు. ఇప్పుడు ఇదే ఆరోపణలపై, సంబంధిత పత్రాలపై మరోసారి దర్యాప్తు జరుగుతోంది.
ఇల్హాన్ ఒమర్ ఇంట్లో తనిఖీలు..
ఇటీవల హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ అధికారులు వాషింగ్టన్ డీసీలోని ఇల్హాన్ ఒమర్ నివాసంలో తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆమె లేదా ఆమె తండ్రి అమెరికా పౌరసత్వానికి సంబంధించిన పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారా? అనే అంశంపై అధికారులు విచారణ చేస్తున్నారు.
అమెరికా సరిహద్దు వ్యవహారాల అధికారి టామ్ హోమన్ చెబుతున్న దాని ప్రకారం.. ఆరోపణలు నిరూపితమైతే ఇల్హాన్ ఒమర్ పౌరసత్వంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇల్హాన్ ఒమర్ ఆర్థిక వివరాలు, ఆమె భర్త వ్యాపారాలపై వేర్వేరు విచారణలు జరుగుతున్నాయి. వాషింగ్టన్‌లోని ఉన్నత స్థాయి ఫెడరల్ ప్రాసిక్యూటర్ ఈ అంశాలపై విచారణ జరుగుతున్నట్లు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
-
Piyush Goyal : వికసిత్ భారత్ సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలి
-
OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
-
OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?
-
YS Jagan: స్థానిక ఎన్నికల్లో అక్రమాలు.. శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?