Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Trump Warns Iran Once Again

Trump: ఇరాన్‌లో పాలన మార్పు తథ్యం.. డీల్ కుదరకపోతే జరిగేది అదేనన్న ట్రంప్

Published Date :February 14, 2026 , 9:35 am
By Suresh Maddala
  • ఇరాన్‌లో పాలన మార్పు తథ్యం
  • డీల్ కుదరకపోతే జరిగేది అదేనన్న ట్రంప్
  • ఇరాన్‌లో మోహరించిన అమెరికా సైన్యం
Trump: ఇరాన్‌లో పాలన మార్పు తథ్యం.. డీల్ కుదరకపోతే జరిగేది అదేనన్న ట్రంప్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇరాన్-అమెరికా మధ్య అణు చర్చల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో పాలన మార్పు ఉత్తమ చర్యగా స్పష్టం చేశారు. నార్త్ కరోలినాలో అమెరికా దళాలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ‘‘కొన్ని సార్లు భయం అవసరం. అది మాత్రమే పరిస్థితులను మెరుగుపరుస్తుంది.’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పటికే మేము చాలా పెద్ద క్యారియర్ సముహాన్ని పంపాము. నేను ఒక ఒప్పందం చేసుకోవాలనుకున్నాను. కానీ వారితో వ్యవహరించడం కష్టంగా మారింది. ఒక ఒప్పందానికి వస్తారనుకుంటే రాలేదు. ఏం చేస్తాం.. మిడ్‌నైట్ హామర్‌లో మేము అదే చేస్తాం.’’ అని ట్రంప్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Pulwama Attack: పుల్వామా దాడిపై ఆరేళ్ల తర్వాత పాకిస్థాన్ సంచలన ప్రకటనతో.. భారతీయుడి రక్తం మరిగింది!

గత కొద్ది రోజులుగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిసెంబర్ 28 నుంచి ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నిరసనకారుల్ని అడ్డుకునే క్రమంలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 30 వేల మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో హత్యలు ఆపకపోతే దాడి చేయాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. తాజాగా అణు ఒప్పందం చేసుకోవాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది. కానీ అందుకు ఇరాన్ నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడి చేసేందుకు అమెరికా ప్రణాళికలు రచిస్తోంది.

ఇది కూడా చదవండి: MLA Kunamneni : కేటీఆర్ ఫోన్ చేసి సీపీఐకు బేషరతుగా మద్దతు ఇస్తామన్నారు

ఇప్పటికే అరేబియా సముద్రంలో యూఎస్ అబ్రహం లింకన్ నౌకతో పాటు యూఎస్‌ఎస్‌ ఫ్రాంక్‌ ఈ పీటర్సన్‌ జూనియర్‌, యూఎస్‌ఎస్‌ స్ప్రూయాన్స్‌ డెస్ట్రాయర్లు, యూఎస్‌ఎస్‌ మిషెల్‌ మార్ఫీలు మోహరించినట్లు తెలుస్తోంది. తాజాగా కరేబియన్ నుంచి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌ సైతం అరేబియాకు వెళ్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో తీవ్ర సంఘర్షణ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. అమెరికా సైన్యం కొన్ని వారాల పాటు ఇరాన్‌పై దాడి చేయొచ్చని తెలుస్తోంది. ట్రంప్ ఆదేశిస్తే మునుపెన్నడూ లేనంతగా దాడి జరగొచ్చని పేర్కొంది. పెద్ద స్థాయిలో అమెరికా సైన్యం తరలివెళ్తు్న్నట్లుగా ఇద్దరు అధికారులు చెప్పినట్లుగా వెల్లడించింది.

మిడ్‌నైట్ హామర్ కంటే భిన్నమైన వ్యూహం
గత సంవత్సరం అమెరికా ఇరాన్‌పై దాడి చేసింది. అణు కేంద్రాలపై పరిమిత ఆపరేషన్ చేసింది. దీన్ని మిడ్‌నైట్ హామర్‌గా పిలుస్తారు. స్టెల్త్ బాంబర్లు అమెరికా నుంచి నేరగా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసి తిరిగొచ్చేశాయి. ఈసారి అలా కాకుండా అణు స్థావరాలతో పాటు ఇరాన్ ప్రభుత్వాన్ని.. భద్రతా సౌకర్యాలను దెబ్బకొట్టనుంది. ఏం జరుగుతుందో చూడాలి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • Iran
  • Middle East
  • Midnight hammer
  • trump

తాజావార్తలు

  • PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

  • VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions