MP YS Avinash Reddy Arrest : ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..
- పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం..
- పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు..
- కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అరెస్ట్..
- అడ్డుకున్న వైసీపీ శ్రేణులు, ఉద్రిక్తత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP YS Avinash Reddy Arrest : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఉదయం 7 గంటలకే పులివెందులతో పాటు ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది.. అయితే, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.. పులివెందులలోని అవినాష్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు పోలీసులు.. దీంతో, ఆయన అరెస్ట్‌ను గ్రహించిన వైసీపీ శ్రేణులు అవినాష్ రెడ్డి ఇంటి వద్దే నిరసనకు దిగారు. వైసీపీ శ్రేణులను అక్కడి నుంచి బయటకు పంపిన పోలీసులు.. వైఎస్ అవినాష్‌రెడ్డి.. బలవంతంగా అరెస్ట్ చేశారు.. ఆయన్ను ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసినంత పనిచేశారు..
Read Also: Asia Cup 2025: స్టార్ పేసర్ ఎంట్రీ.. ఆసియా కప్‌కు భారత జట్టు ఇదే!
Also Read
అయితే, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. జడ్పీటీసీ ఉప ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని మేం కోరుతూ వస్తున్నామని.. నేను ఇంట్లో ఉండగా వచ్చి అరెస్ట్ చేయడం దేనికి అంటూ ఫైర్ అయ్యారు.. ఇక, ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం, పోలీసులు విఫలం అయ్యారని దుయ్యబట్టారు.. అరెస్ట్ సమయంలో పోలీసులతో అవినాష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. తాను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నానని, ఇంట్లోనే ఉంటానంటూ చెప్పినా పోలీసులు వినకుండా అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సిట్టింగ్ ఎంపీ అని కూడా చూడకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదన్నారు.. అయితే, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా పులివెందులలో ఉద్రక్త పరిస్థితులు నెలకొన్నాయి..
తాజావార్తలు
-
SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
-
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్‌పైనే ఆశలు!
-
High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
ట్రెండింగ్
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!