దక్షిణ కొరియా వేదికగా ట్రంప్-జిన్‌పింగ్ సమావేశం సత్‌ఫలితాన్ని ఇచ్చింది. వాణిజ్య యుద్ధం చల్లారింది. రెండు గంటల సుదీర్ఘ సమావేశం తర్వాత ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనాపై విధించిన సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం చైనాపై 57 శాతం సుంకం అమలవుతోంది. ట్రంప్ ప్రకటనతో 47 శాతానికి దిగొచ్చింది.
India US Trade: భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందంపై భారత వాణిజ్యం & పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. బెర్లిన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. భారతదేశం ఎప్పుడు కూడా తొందరపడి లేదా తలపై తుపాకీ గురిపెట్టి వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోదని ఆయన స్పష్టం చేశారు. యూరోపియన్ యూనియన్ (EU), యునైటెడ్ స్టేట్స్ సహా, అనేక ఇతర దేశాలతో భారతదేశం వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని ఆయన అన్నారు. READ ALSO: S-400: చైనా,…
ట్రంప్ టారిఫ్స్ బాంబులను పేల్చుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఇంపోర్టెడ్ ట్రక్కులపై సుంకాలను ప్రకటించాడు. మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25% సుంకాన్ని ప్రకటించారు. ఈ సుంకం నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అయితే మొదట దీనిని అక్టోబర్ 1 నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. పరిశ్రమ వర్గాలు ఖర్చులు, సప్లై చైన్, పోటీ గురించి ఆందోళనలు వ్యక్తం చేసిన తర్వాత గడువును వాయిదా వేశారు. సోమవారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సమాచారాన్ని పంచుకుంటూ, అమెరికాకు…
సుంకాలు చట్ట విరుద్ధం అంటూ ఫెడరల్ అప్పీల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అలాగైతే అమెరికా పూర్తిగా నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. సుంకాలను తొలగించడం అమెరికా వినాశనానికి దారి తీస్తుందని తెలిపారు.
భారతదేశంపై ట్రంప్ సుంకాలు విధించడాన్ని అమెరికా అగ్ర ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది తెలివి తక్కువ పనిగా అభివర్ణించారు. అమెరికా విదేశాంగ విధానంలో అత్యంత తెలివి తక్కువ చర్యగా పేర్కొన్నారు.
భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లుగా కనిపిస్తోంది. సుంకాలు కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోతున్నాయి. నిన్నామొన్నటిదాకా రెండు దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.
పాకిస్థాన్‌తో అమెరికాకు వాణిజ్య డీల్ కుదిరింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. భవిష్యత్‌లో భారత్‌కు పాకిస్థాన్ చమురు కూడా విక్రయించొచ్చని తెలిపారు. ఇక భారత్‌పై 25 శాతం సుంకం విధించినట్లు వెల్లడించారు.
సుంకాలను ఏకపక్షంగా పెంచే ఏ చర్యకైనా బ్రెజిల్ ఆర్థిక చట్టం ప్రకారం ప్రతిస్పందించబడుతుంది అని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. త్వరలో యూఎస్ వస్తువులపై బ్రెజిలియన్ సుంకాలు విధించవచ్చని సంకేతాలు ఇచ్చింది. అలాగే, బ్రెజిల్ యొక్క స్వేచ్ఛా పూరిత ఎన్నికలు, భావ ప్రకటనా స్వేచ్ఛపై అమెరికన్లు కుట్రపూరితంగా దాడులు చేస్తున్నారని లూయిజ్ ఇన్సియో ఆరోపించారు.
Trump Tariffs: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రెజిల్ మాజీ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారోకు సపోర్టుగా.. ఆ దేశంపై 50 శాతం సుంకాన్ని విధిస్తున్టన్లు ప్రకటించారు. బోల్సోనారోపై కొనసాగుతున్న అవినీతి కేసుపై తీవ్ర విమర్శలు చేశారు.