శ్రీవారికి కాసులే .. వరుసగా 9వ నెల కూడా రికార్డు
రుమలలో సరికొత్త రికార్డుల దిశగా శ్రీవారి హుండీ ఆదాయం సాగుతోంది. ఈ వార్షిక ఏడాదిలో రూ.వెయ్యి కోట్ల హుండీ ఆదాయాన్ని టీటీడీ అంచనా వేయగా.. కేవలం 8 నెలల కాలంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.1161.74 కోట్లు నమోదైంది. 8 నెలలుగా ప్రతి నెలా తిరుమల వెంకటేశుడి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్ దాటుతోంది. తాజాగా వరుసగా 9వ నెల కూడా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్ దాటడం విశేషం.
ఏపీలో 2 రోజుల పాటు రాష్ట్రపతి పర్యటన
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈనెల 4న ఢిల్లీ నుంచి ఆమె విజయవాడ చేరుకోనున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీలో ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ముర్ము బయలుదేరి ఉదయం 10:15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తాడిగడప పురపాలక సంఘం పరిధిలోని పోరంకి మురళి రిసార్టులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మానానికి ఆమె హాజరవుతారు.
పవన్ కళ్యాణ్‌కు గుండు కొట్టిన పరిటాల రవి?
గతంలో ఓ వివాదంలో టాలీవుడ్ స్టార్ హీరో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు అప్పటి టీడీపీ నేత పరిటాల రవి గుండు కొట్టించారని తెగ ప్రచారం జరిగింది. తాజాగా పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అసలు పవన్ కళ్యాణ్‌కు నిజంగానే పరిటాల రవి గుండు కొట్టించారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు పరిటాల శ్రీరామ్ సమాధానం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మంచి నటుడు అని.. ఆయనకు సొసైటీ పట్ల ఎంతో కన్సర్న్ ఉందని పరిటాల శ్రీరామ్ అన్నారు. ఓ నాయకుడు ఎదిగే సమయంలో ఇలాంటి రూమర్లు వస్తుంటాయని.. ఇదంతా సర్వసాధారణమేనని తెలాపారు.
ఏపీలో వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్
పీలో వైద్య విద్యార్థులు డ్రెస్ కోడ్ పాటించాలని రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకారం జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించరాదని తన ఆదేశాల్లో పేర్కొంది. అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు అబ్బాయిలు అయితే టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లు వేసుకోకూడదని.. అమ్మాయిలు అయితే చీర, చుడీదార్ మాత్రమే ధరించాలని సూచించింది. విజయవాడలోని డీఎంఈ కార్యాలయంలో జరిగిన వారాంతపు సమీక్షలో ఈ నిర్ణయాలను డీఎంఈ తీసుకుంది.
Read also: Road Accident: స్కూలు బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. విద్యార్థి మృతి
5వ రోజు ప్రారంభమైన బండిసంజయ్ పాదయాత్ర
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన “ప్రజా సంగ్రామ యాత్ర” 5వ రోజుకు చేరుకుంది. ఇవాళ నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అంబకంటి గ్రామ శివారులోని రాత్రి శిబిరం నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమైంది. బాంనీ, నందన్, నర్సాపూర్, కుస్లీ గేట్, నసిరాబాద్ మీదుగా రాంపూర్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. నర్సాపూర్ లో కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. నేడు బండి సంజయ్ పాదయాత్ర మొత్తం 12.1 కిలోమీటర్ల మేరకొనసాగునుంది. ఈరోజు రాంపూర్ సమీపంలో రాత్రి బసచేయనున్నారు బండి సంజయ్.
కామారెడ్డి జిల్లాలో హడలెత్తిస్తున్న పులి
కామారెడ్డి ఆదిలాబాద్ , కొమురంభీం, మంచిర్యాల జిల్లాల్లో పులి సంచారం కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి మండలం సోమర్యాగడి తండాకు చెందిన అంగోత్ బన్సీ గొర్రెలను మేతకు మేపుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గొర్రెల మంద పై చిరుత పులి దాడి చేయడంతో జనం బెబ్బేలెత్తుతున్నారు. గమనించిన స్థానిక గొర్రెల కాపరులు ఆరవడంతో పులి అక్కడి నుంచి పారారయ్యింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పులుల బోన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దృశ్యం-2 రిపీట్.. ప్రియుడితో కలిసి భర్త హత్య
వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు ప్రియుడితో కలిసి భార్య.. తన భర్తను హత్య చేసింది. సినిమా స్టైల్లో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించింది కానీ పోలీసులకు దొరికి పోయింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేసి మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అసలు విషయం తెలిసి షాకయ్యారు. దృశ్యం-2 సినిమాను ఈ హత్య తలపిస్తోంది. ఈ ఘటన ఘటన బెంగళూరులోని సోలదేవనహళ్లిలో చోటుచేసుకుంది.
చేవెళ్లలో విషాదం.. టిప్పర్ లారీ ఢీకొని విద్యార్థి మృతి
రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల మండలం గొల్లపల్లి స్టేజి సమీపంలో ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. ఉదయం పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులపై టిప్పర్ లారీ అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రిత్విక్ గౌడ్ 7సం,, చేవెళ్ల లోని కృష్ణవేణి స్కూల్ లో 1st క్లాస్ చదువుతున్న విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
Read also: GVL Narasimha Rao: భూదోపిడీలో వైసీపీ, టీడీపీ నేతలు తోడుదొంగలు
సిద్ధూ మూసేవాలా హత్య.. కీలక సూత్రధారి అరెస్ట్
పంజాబీ సింగర్, పొలిటికల్ లీడర్ సిద్దూ మూసేవాలా హత్యలో ప్రధాన కుట్రదారుడిగా భావిస్తున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను అమెరికాలో అరెస్ట్ చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అయిన గోల్డీ బ్రార్ మూసేవాలా హత్యలో మాస్టర్ మైండ్. ఇటీవల కెనడా నుంచి యూఎస్ఏకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కాల్నిఫోర్నియాలో నవంబర్ 20న గోల్డీ బ్రార్ ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమచారం. ఈ మేరకు అమెరికా అధికారిక వర్గాలు భారత నిఘా వర్గాలకు సమాచారం అందించాయి.
“లవ్ జీహాద్” వాస్తవం.. శ్రద్ధావాకర్ కేసు ఓ ఉదాహరణ
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి ‘‘లవ్ జీహాద్’’ గురించి ప్రస్తావించారు. జాతీయ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. లవ్ జీహాద్ అనేది నిజం అని.. దీనికి ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ దారుణహత్యే నిదర్శమని అన్నారు. లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా దేశంలో కఠినమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నాను. నిందితుడు అఫ్తాబ్ పాలీగ్రాఫ్ టెస్టులో హిందూ యువతులతో సంబంధం ఉన్నాయని తెలిపిన నేపథ్యంలో ఈ దారుణ హత్యలో లవ్ జీహాద్ మూలాలు ఉన్నాయని ఆయన అన్నారు.
తండ్రిపై కోపం మైనర్ బాలికపై 15 ఏళ్ల బాలుడి అత్యాచారం, హత్య
మహరాష్ట్రలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలుడు, మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కళ్యాణ్ లో జరిగింది. బాలిక తండ్రితో రెండు రోజుల క్రితం గొడవపడినందుకు 15 ఏళ్ల బాలుడు పగ తీర్చుకునేందుకు అతని 9 ఏళ్ల కూతురును కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. ఆ తరువాత హత్య చేశాడు. రెసిడెన్షియల్ సొసైటీలో బాలిక మృతదేహం లభ్యం కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
Read also: Covid-19: చైనాలో తగ్గని కోవిడ్ ఉద్ధృతి.. ప్రజావ్యతిరేకతతో లాక్డౌన్ సడలింపులు
మూడో వారంలో కూడా 2247 స్క్రీన్స్ లో ‘దృశ్యం2’
తెలుగు మలయాళ ‘దృశ్యం సీరీస్’ ఒటీటీకే పరిమితం అయితే హిందీలో మాత్రం అద్భుతమైన కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. అంతటి హిట్ అయిన ‘దృశ్యం’ సినిమాకి సీక్వెల్ గా ‘దృశ్యం 2’ సినిమా 2022 నవంబర్ 18న ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. వంద కోట్ల బెంచ్ మార్క్ ని మొదటి వారంలోనే టచ్ చేసిన ‘దృశ్యం 2’ సినిమా థర్డ్ వీక్ లోకి ఎంటర్ అయ్యింది. ఇప్పటికీ స్ట్రాంగ్ హోల్డ్ మైంటైన్ చేస్తున్న ‘దృశ్యం 2’ బాక్సాఫీస్ దగ్గర 230 కోట్ల వరకూ రాబట్టింది. మూడో వారంలో కూడా ‘దృశ్యం 2’ సినిమా జోష్ తగ్గేలా కనిపించట్లేదు. మూడో వారంలో కూడా 200కి పైగా స్క్రీన్స్ యాడ్ అవ్వగా, మొత్తం 2247 స్క్రీన్స్ లో ‘దృశ్యం2’ ప్రదర్శింపబడుతోంది. అజయ్ దేవగన్ నటించిన ఈ హిందీ సీరీస్ లో నటించారు.
పాన్ ఇండియా సినిమా నుంచి సాంగ్ వచ్చేస్తోంది…
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి విశ్వక్ సేన్ దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఇటివలే ఈ సినిమా ట్రైలర్ 1.0ని రిలీజ్ చేసిన విశ్వక్ సేన్, మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టాడు. ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత ‘ధమ్కీ’ సినిమాపై అంచనాలు పెరిగాయి. నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన విశ్వక్ సేన్, ‘ధమ్కీ’ సినిమా ఫస్ట్ సాంగ్ ని డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా’ అనే బీచ్ సాంగ్ ట్రైలర్ లో కొంచెం చూపించారు. క్యాచీగా ఉన్న ఈ పాట చార్ట్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ‘ధమ్కీ’ మూవీతో విశ్వక్ సేన్ పాన్ ఇండియా హీరో అవుతాడో లేదో చూడాలి అంటే వచ్చే ఫిబ్రవరి 17 వరకూ ఆగాల్సిందే.
Drishyam 2: మూడో వారంలో కూడా 2247 స్క్రీన్స్ లో ‘దృశ్యం2’