Road Accident: వేగానికి కళ్లెం వేసిన రహదారులు నెత్తురోడుతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కళ్లముందే కనిపించి ఆడుకున్న బిడ్డలు క్షణాల్లో మృత్యువాత పడుతున్నారు. స్కూల్ కు వెళ్లి వస్తానంటూ బిడ్డలు తిరిగి రాని లోకానికి వెళ్లడంతో తల్లిదండ్రులకుతీరని విషాదాన్ని నింపింది. ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
read also: Tirumala: శ్రీవారికి కాసులే కాసులు.. వరుసగా 9వ నెల కూడా రికార్డు..!!
రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల మండలం గొల్లపల్లి స్టేజి సమీపంలో ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. ఉదయం పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులపై టిప్పర్ లారీ అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రిత్విక్ గౌడ్ 7సం,, చేవెళ్ల లోని కృష్ణవేణి స్కూల్ లో 1st క్లాస్ చదువుతున్న విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు, విద్యార్థి కుటుంబ సభ్యులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. న్యాయం చేయాలని భీష్మించి కూర్చన్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్థంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.
Dhamki: పాన్ ఇండియా సినిమా నుంచి సాంగ్ వచ్చేస్తోంది…