తెలుగు మలయాళ ‘దృశ్యం సీరీస్’ ఒటీటీకే పరిమితం అయితే హిందీలో మాత్రం అద్భుతమైన కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. అజయ్ దేవగన్ నటించిన ఈ హిందీ సీరీస్ లో భాగంగా మొదటి ‘దృశ్యం’ సినిమా 2015లో థియేటర్స్ లోకి వచ్చి దాదాపు 150 కోట్లు రాబట్టింది. ఒక రీమేక్ సినిమా, అది కూడా అప్పటికే నాలుగు భాషల్లో రీమేక్ అయిన మూవీ ఈ రేంజులో కలెక్షన్స్ ని రాబడుతుందాని ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యారు. అంతటి హిట్ అయిన ‘దృశ్యం’ సినిమాకి సీక్వెల్ గా ‘దృశ్యం 2’ సినిమా 2022 నవంబర్ 18న ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టింది.
వంద కోట్ల బెంచ్ మార్క్ ని మొదటి వారంలోనే టచ్ చేసిన ‘దృశ్యం 2’ సినిమా థర్డ్ వీక్ లోకి ఎంటర్ అయ్యింది. ఇప్పటికీ స్ట్రాంగ్ హోల్డ్ మైంటైన్ చేస్తున్న ‘దృశ్యం 2’ బాక్సాఫీస్ దగ్గర 230 కోట్ల వరకూ రాబట్టింది. మూడో వారంలో కూడా ‘దృశ్యం 2’ సినిమా జోష్ తగ్గేలా కనిపించట్లేదు. మూడో వారంలో కూడా 200కి పైగా స్క్రీన్స్ యాడ్ అవ్వగా, మొత్తం 2247 స్క్రీన్స్ లో ‘దృశ్యం2’ ప్రదర్శింపబడుతోంది. ఒక సినిమా వారం ఆడడమే కష్టం అనుకుంటున్న సమయంలో, దృశ్యం 2 సినిమా మూడో వారంలో కూడా జోష్ చూపిస్తుండడం కష్టాల్లో ఉన్న బాలీవుడ్ కి కలిసొచ్చే విషయమే. ‘అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్’ సినిమా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్ అయితే ‘దృశ్యం2’ థియేటర్స్ తగ్గడం గ్యారెంటి, ఆలోపు ‘దృశ్యం 2’ సినిమాని అడ్డుకునే మరో చిత్రం బాలీవుడ్ లో రిలీజ్ అయ్యేలా కనిపించట్లేదు. సో మరో రెండు వారాల పాటు ‘దృశ్యం 2’ స్పీడ్ కి బ్రేకులు లేని బండిలా దూసుకోని పోవడం పక్కా.