Titan: టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రమాదం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడ శిథిలాలను చూపించేందుకు ఐదుగురిలో వెళ్లిన టైటాన్ సముద్రంలోనే పేలిపోయింది. తాజాగా టైటాన్ కు సంబంధించిన శిథిలాలను బయటకు తీసుకువచ్చారు. శిథిలాల్లో మానవ అవశేషాలను గుర్తించారు. ఈ ఘటనకు అంతా ‘ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్’ సంస్థను నిందిస్తున్నారు. సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే టైటాన్ లో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారని ఆరోపిస్తున్నారు.