President Draupadi Murmu pays tribute to Queen Elizabeth II: భారతప్రజల తరుపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యూకే రాణి ఎలిజబెత్ 2కు నివాళులు అర్పించారు. ద్రౌపది ముర్ము క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియల కోసం లండన్ వెళ్లారు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ హాల్ లో ఉన్న రాణి భౌతికకాయానికి భారత ప్రజల తరుపున ఆమె నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ఈ నెల 17 నుంచి 19 వరకు యూకేలో అధికారిక పర్యటనలో ఉన్నారు.…
క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనడానికి, భారత ప్రభుత్వం తరపున సంతాపాన్ని తెలియజేయడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం సాయంత్రం లండన్ చేరుకున్నారు.
Russia, Myanmar, Belarus Not Invited For Queen's Funeral:యూకే రాణి ఎలిజబెత్ 2 సెప్టెంబర్ 8న స్కాట్లాండ్ లోని బల్మోరల్ కాజిల్ లో మరణించారు. ఆమె మరణం పట్ల ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. వివిధ దేశాధినేతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు. వచ్చే సోమవారం క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు జరగనున్నాయి. సెప్టెంబర్ 19న జరగనున్న క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు వివిధ దేశాలను బ్రిటన్ ఆహ్మానించింది. అయితే మూడు దేశాలను మాత్రం బ్రిటన్ ఆహ్వానించలేదని…
బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్-2 చివరియాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. రాణి భౌతికకాయాన్ని ఆమె తుదిశ్వాస విడిచిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం స్కాట్లండ్ రాజధాని ఎడింబర్గ్‌లోని రాణి అధికారిక నివాసం హోలీ రుడ్‌హౌస్ ప్యాలెస్‌కు తరలించారు.
బ్రిటన్‌ను ఎక్కువ కాలం ఏలిన రాణి ఎలిజబెత్-2 కన్నుమూయడంతో ఆమె కుమారుడు 73 ఏళ్ల చార్లెస్-3కి సింహాసనం బదిలీ అయింది. ఇకపై ఆయనను కింగ్ చార్లెస్ 3 పేరుతో వ్యవహరిస్తారు. లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో యాక్సెషన్ కౌన్సిల్ భేటీలో కింగ్ చార్లెస్-3ను బ్రిటన్ కొత్త చక్రవర్తిగా ప్రకటించారు.
యూకేను ఎక్కువ కాలం పరిపాలించిన క్వీన్ ఎలిజబెత్-2 తన 96 ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కన్నుమూసినట్లు బకింగ్‌హాం ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. ఈరోజు తెల్లవారుజామున రాణి ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో బాల్మోరల్‌లో వైద్య పర్యవేక్షణలో ఉన్నారని ప్యాలెస్ తెలిపింది.