Venu Donepudi Interview for Viswam Movie: హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వస్తున్న విశ్వం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వేణు దోనేపూడి మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 11, 2024 న విడుదల కానుంది. ఈ చిత్రం గురించి నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. ఆ సంగతులివి..
* విశ్వం ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, డ్రామా వంటి కమర్షియల్ అంశాలతో అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీను వైట్ల స్క్రిప్ట్, అందులోని కామెడీ, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్నీ అద్భుతంగా వచ్చాయి.
* కామెడీ, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ మేళవించిన కథనాన్ని శ్రీను వైట్ల తన స్టైల్‌లో విశ్వం రూపొందించారు. మిలన్‌లో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు ప్రధాన హైలైట్ అవుతాయి. గోపీచంద్ అత్యుత్తమంగా నటించారు. మాతేరా సిటీ, రోమ్, మిలన్, గోవా, హిమాచల్ ప్రదేశ్ వంటి సుందరమైన ప్రదేశాలలో ఈ చిత్రాన్ని షూట్ చేశాం.
* గోపీచంద్ ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకుని శ్రీను వైట్ల గారు కథపై పనిచేశారు. గోపీచంద్ గారు డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు తన పాత్రను అద్భుతంగా పోషించారు. అతను కామెడీ టైమింగ్,యాక్షన్‌కు ఆడియెన్స్ ఫిదా అవుతారు. అతని కెరీర్‌లో విశ్వం అత్యుత్తమ ప్రదర్శనగా నిలుస్తుంది. శ్రీను వైట్ల, గోపీచంద్‌లతో కలిసి పనిచేయడంతో ఎన్నో విషయాల గురించి నేర్చుకున్నాను.
* అమెరికాలో చాలా సంవత్సరాలు ఆటోమొబైల్ పరిశ్రమలో పనిచేశాను. కానీ సినిమాలు, కథ చెప్పడం నా అభిరుచి. యుఎస్‌లో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్/ఎగ్జిబిటర్‌గా, 140కి పైగా తెలుగు, తమిళం, హిందీ చిత్రాలను విడుదల చేశాను. సినిమాల మీదున్న ప్యాషన్‌తోనే ఇక్కడకు వచ్చాను. విశ్వం సినిమాను నిర్మించాను. నెక్స్ట్ ‘జర్నీ టు అయోధ్య’ స్క్రిప్ట్ దశలో ఉంది.
* చిత్రాలయం స్టూడియోలో అద్భుతమైన కథలు, సంగీతంతో ఆకట్టుకునే చిత్రాలను నిర్మించడం నా లక్ష్యం.