Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతంలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. అక్కడి ప్రభుత్వ గోధుమల కొనుగోలు వ్యూహం అట్టర్ ప్లాప్ కావడంతో.. దాని ప్రభావం నేరుగా సామాన్య ప్రజలపై పడింది. మార్కెట్లో గోధుమలు, గోధుమ పిండి ధరలు ఆకాశాన్నంటాయి. జనం భారీ ధరలు చెల్లించి పిండి కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అసలేం జరిగిందంటే..
టార్గెట్ 10 లక్షలు.. కొన్నది కేవలం 8 శాతమే!
సింధ్ ప్రాంతంలో ఈ సీజన్లో 10 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ జూన్ 4 నాటికి ఆహార శాఖ కేవలం 79,835.66 మెట్రిక్ టన్నులను మాత్రమే కొనుగోలు చేయగలిగింది. అంటే ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యంలో 8 శాతం కూడా పూర్తి కాలేదన్నమాట. రైతుల నుంచి ప్రభుత్వం గోధుమలు సేకరించలేకపోవడానికి గల కారణాలను అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (MSP) కంటే బహిరంగ మార్కెట్ (ఓపెన్ మార్కెట్) లో వ్యాపారులు రైతులకు ఎక్కువ ధర చెల్లిస్తున్నారు. దాంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రాకుండా, నేరుగా ప్రైవేట్ వ్యాపారులకే తమ పంటను అమ్ముకున్నారు. ప్రభుత్వం 40 కిలోల గోధుమలకు 3,500 పాకిస్థానీ రూపాయల మద్దతు ధరను ప్రకటించి, సుమారు 3.32 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చాలని ప్లాన్ చేసింది. కానీ మార్కెట్ రేటు ఎక్కువగా ఉండటంతో ఈ ప్లాన్ పూర్తిగా బెడిసికొట్టింది.
Also Read
- XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
- Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
- Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
- Trump-Jinping: జిన్‌పింగ్‌కు ట్రంప్ దంపతులు స్వాగతం పలకడం వెనుక ఇంత మతలబు ఉందా?
ప్రభుత్వ సేకరించిన నిల్వలు తక్కువగా ఉండటం, ఇదే అదనుగా ప్రైవేట్ వ్యాపారులు బ్లాక్ మార్కెట్ (జమాఖోరీ) కి తెరలేపడంతో ఓపెన్ మార్కెట్లో గోధుమల ధరలు ఏకంగా 25 శాతం పెరిగాయి. కరాచీలో 100 కిలోల గోధుమల ధర ఏకంగా 11,100 పాకిస్థానీ రూపాయలకు చేరింది. పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌లో 100 కిలోలకు 10,900 రూపాయలుగా పలుకుతోంది. ధరలను నియంత్రించడంలో సింధ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. రిటైల్ మార్కెట్లో కిలో గోధుమ పిండిని 135 నుంచి 140 పాకిస్థానీ రూపాయలకు విక్రయిస్తున్నారు. నిజానికి ప్రభుత్వం నిర్ణయించిన అధికారిక ధర కేవలం 107 రూపాయలు మాత్రమే. ప్రభుత్వం ఫిక్స్ చేసిన ధర కంటే దాదాపు 30 రూపాయలు అదనంగా అమ్మకందారులు వసూలు చేస్తున్నారు. ప్రముఖ పాకిస్థానీ పత్రిక ‘డాన్’ కథనం ప్రకారం.. సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా ఈ ధరల పెరుగుదలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా మాట్లాడుతూ.. కొందరు పెద్ద వ్యాపారులు గోధుమలను అక్రమంగా నిల్వ ఉంచి మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, మార్కెట్‌పై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
- Tags
- Food Crisis
- Karachi
- Pakistan
- Sindh
తాజావార్తలు
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
-
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
-
LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
-
Off The Record: వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం వారసుడా? అసలు కథ ఏంటి?
-
XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!