Trump-Jinping: జిన్‌పింగ్‌కు ట్రంప్ దంపతులు స్వాగతం పలకడం వెనుక ఇంత మతలబు ఉందా?
- అమెరికా గడ్డపై అడుగుపెట్టిన జిన్‌పింగ్ దంపతులు
- ఘన స్వాగతం పలికిన ట్రంప్ దంపతులు
- అత్యధిక ప్రాధాన్యతపై అంతర్జాతీయంగా చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దంపతులు అమెరికాకు చేరుకున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత అమెరికా గడ్డపై అడుగుపెట్టారు. ఇక మునుపెన్నడూ లేనంతగా ట్రంప్ దంపతులు ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం ప్రాధాన్యత సంతరించుకుంది. సహజంగా వైట్‌హౌస్ దగ్గరే ఆహ్వానం పలుకుతారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా ప్రొటోకాల్‌కు భిన్నంగా జాయింట్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలకడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ పరిణామంతో జిన్‌పింగ్‌కు ట్రంప్ చాలా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఇక స్వాగతానికి 100 అడుగుల రెడ్‌కార్పెట్ ఏర్పాటు చేశారు. ఇంకోవైపు మిలిటరీ బ్యాండ్ సంగీతం వినిపిస్తుండగా ఇద్దరు నేతలు పక్కపక్కన నిల్చుండగా రెండు బీ-1 బాంబర్లు గాల్లో విన్యాసాలు చేశాయి. అలాగే అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శించింది. విమానాశ్రయంలో రెడ్ కార్పెట్ దగ్గర ఆరు ఎఫ్-22 యుద్ధ విమానాలు, ఆరు ఎఫ్-16 విమానాలు రన్‌వేపై బారులు తీరాయి. దీంతో చైనాకు ట్రంప్ ఎందుకింత ప్రాధాన్యత ఇస్తున్నారన్న చర్చ నడుస్తోంది. ఇక గురువారం వైట్‌హౌస్‌లో ప్రత్యేక భేటీ, స్టేట్ డిన్నర్, వైట్‌హౌస్‌లో సైనిక వేడుక, నేషనల్ ఆర్కైవ్స్ సందర్శన వంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇవి కూడా ఒక రేంజ్లో ఉండబోతున్నాయి.
ట్రంప్ ఏం కోరుకుంటున్నారు?
ట్రంప్ మే నెలలో చైనాలో పర్యటించారు. అప్పుడు సాధారణ స్వాగతమే లభించింది. అప్పట్లో బీజింగ్‌లో ట్రంప్‌కు జిన్‌పింగ్ విమానాశ్రయంలో స్వాగతం పలకలేదు. అంతేకాదు అధికారిక ఒప్పందం గానీ.. సంయుక్త విలేకర్ల సమావేశం గానీ.. ఉమ్మడి ప్రకటన కూడా వెలువడ లేదు. కానీ తాజాగా జిన్‌పింగ్ అమెరికాకు వస్తే మాత్రం అందుకు భిన్నంగా ట్రంప్ స్వాగతం పలకడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
Also Read
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఇరాన్‌పై అమెరికా యుద్ధం విషయంలో ట్రంప్ స్వదేశంలో విమర్శలు, ప్రజల్లో అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. త్వరలో అమెరికా మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చైనా వేగంగా ఎదుగుతుందన్న వార్తలు అమెరికన్లలో అసంతృప్తి రేపుతోంది. ఈ ఆందోళనలను తగ్గించడం ట్రంప్‌కు ముఖ్యమైన అంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే జిన్‌పింగ్‌కు ఘన స్వాగతం కూడా ఒక రాజకీయ సందేశంగా భావిస్తున్నారు.
మారుతున్న సమీకరణాలు
ఇక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా దేశీయంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ.. బలమైన ఆర్థిక, వాణిజ్య స్థితితో అమెరికాకు చేరుకున్నారు. గత దశాబ్దంలో అమెరికా-చైనా రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు గణనీయంగా వృద్ధి చెందాయి. అయితే అమెరికా ఇప్పటికీ ఆర్థికంగా ముందంజలో ఉన్నప్పటికీ.. చైనా మాత్రం అమెరికాను ఎదుర్కొనే సామర్థ్యాలను పెంచుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. వాషింగ్టన్కు చెందిన స్టిమ్సన్ సెంటర్ చైనా ప్రోగ్రామ్ డైరెక్టర్ సన్ యున్ ప్రకారం.. గతంలో చైనా శక్తి పరంగా అమెరికా కంటే వెనుకబడి ఉండేది. ఇప్పుడు మాత్రం అమెరికాకు సమీప ప్రత్యర్థిగా ఎదిగిందని పేర్కొన్నారు.
గతేడాది ట్రంప్ చైనా దిగుమతులపై భారీగా 125 శాతం సుంకాలు విధించినప్పుడు.. బీజింగ్ కూడా ప్రతిస్పందించింది. అదే సమయంలో స్మార్ట్ఫోన్ల నుంచి యుద్ధ విమానాల వరకు అనేక ఉత్పత్తులకు అవసరమైన కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌లో తన ఆధిపత్యాన్ని చైనా వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంది. దీంతో అమెరికా-చైనా వాణిజ్య వివాదం మరింత తీవ్రంగా మారింది.
ఏం చర్చిస్తారు?
ట్రంప్-జిన్‌పింగ్ భేటీలో తైవాన్ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని రాయిటర్స్ పేర్కొంది. తైవాన్‌పై చైనా తన హక్కును మరోసారి ప్రస్తావించే అవకాశం ఉండగా.. ఈ అంశంపై చర్చించడాన్ని అమెరికా మాత్రం సాధ్యమైనంత వరకు నివారించాలని భావిస్తోంది. మరోవైపు జిన్‌పింగ్ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. చైనా విషయంలో కొన్ని ఎగుమతి నియంత్రణలను ట్రంప్ కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. ఇరాన్‌తో కొనసాగుతున్న ఘర్షణ విషయంలో ఏర్పడిన ప్రతిష్ఠంభనను అధిగమించేందుకు చైనా ట్రంప్‌కు ఏమైనా సహాయం చేస్తుందా అన్నది కూడా కీలకంగా మారింది.
వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు
ఇక అమెరికా, చైనా ఇప్పటికే వాణిజ్య సంధిని వచ్చే ఏడాది ప్రారంభం వరకు పొడిగించేందుకు అంగీకరించినట్లు అమెరికా ప్రకటించింది. అయితే గురువారం జరగనున్న చర్చల్లో కొన్ని ప్రత్యేక రంగాల్లో సుంకాలను తగ్గించడం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో సహకారం, రెండు దేశాల సైన్యాల మధ్య సంభాషణలను విస్తరించడం వంటి అంశాలపై మరిన్ని ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. చైనాలో నిర్బంధంలో ఉన్న కొంతమంది అమెరికన్లు, ఇతర విదేశీయుల విడుదల కోసం కూడా ట్రంప్ ప్రయత్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పైనా చర్చ
అమెరికా-చైనా మధ్య మరో కీలక పోటీ రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రెండు దేశాలు ఏఐ రంగంలో తీవ్ర పోటీ పడుతున్నాయి. అదే సమయంలో ఈ సాంకేతికతతో ముడిపడిన ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐపై మరింత చర్చించేందుకు రెండు దేశాలు అంగీకరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇరు దేశాల అధినేతలు తమ తమ ప్రాధాన్య అంశాల్లో పెద్దగా రాజీ పడాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో ఉన్నట్లు విశ్లేషణలు సూచిస్తున్నాయి.
స్టేట్ డిన్నర్లో టెక్ దిగ్గజాలు
ఇక జిన్‌పింగ్ గౌరవార్థం నిర్వహించనున్న స్టేట్ డిన్నర్లో రెండు దేశాలకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీల అధిపతులు పాల్గొనే అవకాశం ఉంది. యాపిల్‌కు చెందిన జాన్ టెర్నస్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ వంటి ప్రముఖులు ఈ విందుకు హాజరుకానున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా ఉన్న చైనా, అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌గా ఉన్న అమెరికా.. తీవ్ర విభేదాలున్నప్పటికీ స్థిరత్వాన్ని ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ట్రంప్-జిన్‌పింగ్ భేటీ అత్యంత ప్రణాళికాబద్ధంగా సాగుతుందని అంచనా. సమావేశం అనంతరం ఇరు దేశాలు సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించే బదులు.. తమ తమ దేశాల ప్రజలకు చేరేలా వేర్వేరు ప్రకటనలు విడుదల చేసే అవకాశం ఉంది. ఒకవైపు వాణిజ్యం, తైవాన్, ఏఐ, ఎగుమతి నియంత్రణలు, ఇరాన్ వంటి అంశాలపై విభేదాలు కొనసాగుతుండగా.. మరోవైపు ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాలను పూర్తిగా దెబ్బతినకుండా కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే జిన్‌పింగ్‌కు ట్రంప్ ఇస్తున్న ఘన స్వాగతం వెనుక దౌత్యం, ఆర్థిక ప్రయోజనాలు, దేశీయ రాజకీయ సందేశం.. ఇలా పలు అంశాలు ఉన్నట్లు ఈ భేటీ పరిణామాలు సూచిస్తున్నాయి.
President Donald J. Trump and First Lady Melania Trump greet President Xi Jinping of China and Madame Peng Liyuan upon their arrival in Washington, D.C., ahead of the state visit at the White House. https://t.co/nm2vGonChM
— The White House (@WhiteHouse) September 24, 2026
- Tags
- Donald Trump
- trump
- Xi Jinping
తాజావార్తలు
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..