Balayya : బ్రో ఐ డోంట్ కేర్.. సర్జరీ జరిగినా షూటింగ్‌కు వస్తానంటున్న నట’సింహం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహ బాలకృష్ణకు మొదటి నుంచీ సినిమా అంటే అంకిత భావం ఎక్కువ. అది తండ్రి యన్టీఆర్ నుండి అబ్బినదే అని అందరికీ తెలుసు. బాలకృష్ణ తన 111వ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ షూటింగ్ లో మోకాలికి గాయం అవడంతో మోకాలుకి సర్జరీ చేసి బాలయ్యను వైద్యులు రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని సూచించారు. అయితే బాలయ్య సెప్టెంబర్ నుంచే షూటింగ్ చేయాలనీ డైరెక్టర్ కు తెలిపాడట. సెప్టెంబర్ లో తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని అక్టోబర్ లో ప్యాచ్ వర్క్, నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేసుకోమని సూచించారట. డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను జనం ముందు నిలపాలన్నది బాలయ్య యోచన. అందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత వెంకట సతీశ్ కిలారు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం.
బాలయ్యకు డిసెంబర్ మాసం బాగానే కలసి వచ్చింది. ఆయన కెరీర్ లో ఫస్ట్ టైమ్ భారీ ఓపెనింగ్స్ చూసిన ‘పట్టాభిషేకం’, అనూహ్య విజయం సాధించిన ‘లారీ డ్రైవర్’, ప్యాండమిక్ తరువాత జనాన్ని థియేటర్స్ కు రప్పించిన ‘అఖండ’ చిత్రాలు డిసెంబర్ లోనే రిలీజయ్యాయి. అందువల్లే తాను గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటిస్తోన్న రెండో సినిమాను డిసెంబర్ లోనే విడుదల చేయాలని బాలయ్య భావిస్తున్నారు. కాసింత ఆలస్యం చేసి జనవరిలో పొంగల్ బరిలోనే దూకితే మంచిదని కొందరు సూచిస్తున్నారు. అయితే ఈ సారి సంక్రాంతికి పలు చిత్రాలు విడుదలవుతున్నాయి.. ఈ నేపథ్యంలో వారికి దారి ఇచ్చి తన సినిమాను ముందే రిలీజ్ చేస్తే మేలని బాలయ్య అనుకుంటున్నారు. డిసెంబర్ నెలలోనూ భారీ చిత్రాలే వస్తున్నాయి. డిసెంబర్ 3న ప్రభాస్ ‘ఫౌజీ’ వస్తోంది. ఇక డిసెంబర్ 18న హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ ‘అవెంజర్స్ – డూమ్స్ డే, డ్యూన్-3’ వస్తున్నాయి. డిసెంబర్ 24న షారుఖ్ ఖాన్ ‘కింగ్’ రిలీజ్ కానుంది. కాబట్టి సరైన తేదీని చూసుకొని బాలయ్య తన సినిమాను జనం ముందు నిలిపితే మంచిదనీ కొందరి మాట. మరి బాలయ్య-గోపీచంద్ మలినేని మూవీ ఎప్పుడు ఎలా ప్రేక్షకులను పలకరిస్తుందో చూడాలి.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!