10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
- ఐక్యూ జెడ్11ఎస్ స్మార్ట్‌ఫోన్ చైనాలో అధికారికంగా లాంచ్
- ఇందులో 10,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ..
- 6.83 అంగుళాల 1.5కే అమోలెడ్ డిస్ప్లేతో పాటు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- వెనుకవైపు 50 MP ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా-వైడ్ కెమెరా, 8 MP ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా
- డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO Z11S: ఐక్యూ (iQOO) నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Z11Sను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. భారీ బ్యాటరీ, హై-రిఫ్రెష్-రేట్ AMOLED డిస్ప్లే, MediaTek Dimensity 7500 ప్రాసెసర్, IP69 రేటింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. iQOO నుండి 10,000mAh బ్యాటరీతో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే.. మరి ఈ మొబైల్ పూర్తి వివరాలను చూసేద్దామా..
AMOLED డిస్ప్లే:
iQOO Z11Sలో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లేను అందించారు. ఇది 2800 × 1260 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. స్క్రీన్-టు-బాడీ రేషియో 94.47%గా ఉంది. 2,000 నిట్స్ వరకు పీక్ ఫుల్-స్క్రీన్ బ్రైట్నెస్, 10-బిట్ కలర్ డెప్త్, 100% DCI-P3 కలర్ గ్యామట్, HDR10+ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కళ్లపై ఒత్తిడి తగ్గించేందుకు ఫుల్-బ్రైట్నెస్ DC డిమ్మింగ్‌ను కూడా అందించారు.
Also Read
- 93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
- లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
- స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
- 990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
ప్రాసెసర్:
పనితీరు విషయానికి వస్తే.. iQOO Z11Sలో 4nm ప్రాసెస్‌పై తయారైన మీడియాటెక్ డిమెంసిటీ 7500 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది 2.6GHz వరకు క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం Mali-G615 MC2 GPU ఉంది. AnTuTu V11 బెంచ్‌మార్క్‌లో ఈ ఫోన్ 13,09,171 పాయింట్లకు పైగా స్కోర్ సాధించినట్లు కంపెనీ పేర్కొంది. గత తరం కాన్ఫిగరేషన్లతో పోలిస్తే సింగిల్-కోర్ పనితీరులో 24% మెరుగుదల ఉందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB, 12GB LPDDR4X RAM ఆప్షన్లలో లభిస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే 128GB, 256GB, 512GB UFS 3.1 వేరియంట్లు ఉన్నాయి.

10,000mAh బ్యాటరీ:
iQOO Z11Sలో 10,000mAh కెపాసిటీ కలిగిన “బ్లూ ఓషన్” బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీని CATLతో కలిసి అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. రెండో తరం సెమీ-సాలిడ్-స్టేట్ బ్యాటరీ టెక్నాలజీతో పాటు మ్యాజిక్ క్యూబ్ ప్యాకేజింగ్ 2.0ను ఉపయోగించడం వల్ల ఇంత పెద్ద బ్యాటరీని ఫోన్ బాడీలో కాంపాక్ట్‌గా అమర్చగలిగారు. దీనికి 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
కెమెరాలు:
ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరాను అందించారు. ఇందులో f/1.8 అపెర్చర్, OIS సపోర్ట్ ఉన్నాయి. దీనికి 8MP అల్ట్రా-వైడ్ కెమెరా జతగా ఉంది. వీటికి ‘ఔరా లైట్’ కూడా అందించారు. 4K వీడియో రికార్డింగ్‌కు ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ముందు భాగంలో 8MP ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరా ఉంది.
మరిన్ని ఫీచర్లు:
డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఇందులో IP68, IP69 రేటింగ్స్ లభించాయి. గేమింగ్ సమయంలో మెరుగైన కనెక్టివిటీ కోసం AI E-స్పోర్ట్స్ సిగ్నల్ ఇంజిన్ 2.0, సరౌండ్ యాంటెన్నా అర్రేను అందించారు. అంతేకాకుండా ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, NFC, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్, X-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటార్, ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6తో పనిచేస్తుంది. కనెక్టివిటీ కోసం 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, NFC, GPS తదితర ఫీచర్లు ఉన్నాయి.
ధర:
చైనాలో iQOO Z11S 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లు (రూ. 28363)గా ఉంది. 8GB + 256GB మోడల్ ధర 2,199 యువాన్లు (రూ. 31200), 12GB + 256GB వేరియంట్ ధర 2,499 యువాన్లు (రూ. 35460). టాప్-ఎండ్ 12GB + 512GB మోడల్ ధర 2,899 యువాన్లు (రూ. 41135)గా నిర్ణయించారు. భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు విడుదల అవుతుంది, ఏ ధరకు లభిస్తుంది అనే విషయంపై కంపెనీ నుంచి ఇంకా అధికారిక సమాచారం అందించలేదు.
తాజావార్తలు
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Gold Spot Glimpse: 90s రోజులు గుర్తొచ్చేలా ‘గోల్డ్ స్పాట్’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్..
-
CM Vijay: పోలీసులు పవర్ సెంటర్‌గా మారొద్దు.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!