గూర్ఖా రెజిమెంట్‌కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
- రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గోర్ఖా ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల..
- గోర్ఖా రెజిమెంట్ వారసత్వం, స్ఫూర్తికి నివాళిగా ఈ ప్రత్యేక ఎడిషన్
- ప్రత్యేకమైన గోర్ఖా గ్రీన్ పెయింట్ స్కీమ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Royal Enfield Classic 350 Gorkha Edition: గూర్ఖా రెజిమెంట్ వారసత్వం, స్ఫూర్తికి నివాళిగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) భారత మార్కెట్లో కొత్త క్లాసిక్ 350 గోర్ఖా ఎడిషన్ (Classic 350 Gorkha Edition)ను విడుదల చేసింది.
క్లాసిక్ 350 గూర్ఖా ఎడిషన్ కు ప్రత్యేకమైన గూర్ఖా గ్రీన్ పెయింట్ స్కీమ్‌ను అందించారు. గూర్ఖా రెజిమెంట్‌కు గుర్తింపుగా నిలిచే క్రాస్డ్ ఖుక్రి గుర్తుతో ప్రత్యేక ఇన్సిగ్నియాను కూడా పొందుపరిచారు. స్టాండర్డ్ క్లాసిక్ 350లోని రెట్రో డిజైన్‌ను కొనసాగిస్తూనే, గూర్ఖా రెజిమెంట్ చరిత్ర, గుర్తింపును ప్రతిబింబించేలా కొన్ని ప్రత్యేక అంశాలను జోడించారు. టియర్ డ్రాప్ ఆకారంలోని ఫ్యూయల్ ట్యాంక్, కర్వ్డ్ బాడీ ప్యానెల్స్, డీప్ ఫెండర్స్, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్, ఫిన్డ్ ఇంజిన్ కేసింగ్స్ వంటి క్లాసిక్ 350లోని ప్రధాన డిజైన్ అంశాలు ఇందులో కొనసాగుతాయి.
Also Read
- BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
- TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
349cc ఇంజిన్:
మెకానికల్‌గా క్లాసిక్ 350 గూర్ఖా ఎడిషన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. ఇందులో 349cc, సింగిల్ సిలిండర్, ఎయిర్/ఆయిల్ కూల్డ్ J-సిరీస్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ 6,100 rpm వద్ద 20.2 PS పవర్, 4,000 rpm వద్ద 27 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ జతగా ఉంది. ఇంజిన్‌ను తక్కువ RPMల వద్ద మెరుగైన టార్క్ అందించేలా ట్యూన్ చేశారు. వాస్తవ రైడింగ్ పరిస్థితుల్లో సుమారు 35 – 40 kmpl మైలేజ్ లభిస్తుందని రాయల్ ఎన్ఫీల్డ్ చెబుతోంది.

అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్:
బైక్‌లో అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ ను అందించారు. దీంతో క్లచ్ ఆపరేషన్ తేలికగా మారడంతో పాటు గేర్ షిఫ్టింగ్ మరింత స్మూత్‌గా ఉంటుంది. అదనంగా USB టైపు-C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఈ మోటార్ సైకిల్‌ను ట్విన్ డౌన్ ట్యూబ్ ఛాసిస్‌పై నిర్మించారు. నగర రోడ్లు, హైవే రైడింగ్‌కు అనుగుణంగా సస్పెన్షన్‌ను తయారీ చేశారు. బైక్ కర్బ్ వెయిట్ సుమారు 195 కిలోలు ఉంటుంది. అలాగే ఇందులో న్యూట్రల్ రైడింగ్ పొజిషన్, వెడల్పాటి హ్యాండిల్బార్లు, మిడ్ మౌంటెడ్ ఫుట్‌పెగ్స్ ఉన్నాయి. ఇవి రోజువారీ ప్రయాణాలతో పాటు లాంగ్ రైడ్లలోనూ మెరుగైన కంఫర్ట్ అందించేలా రూపొందించారు. క్లాసిక్ 350లోని సింగిల్ లేదా స్ప్లిట్ సీట్ కాన్ఫిగరేషన్‌కు అనుగుణంగా ఈ ఎడిషన్ కూడా అదే ప్రాథమిక నిర్మాణాన్ని కొనసాగిస్తుంది.

గూర్ఖా కలెక్షన్ కూడా విడుదల:
క్లాసిక్ 350 గూర్ఖా ఎడిషన్ తో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రత్యేకంగా గూర్ఖా కలెక్షన్ ను కూడా లాంచ్ చేసింది. ఇందులో రైడింగ్ గేర్, దుస్తులు, యాక్సెసరీస్, కలెక్టబుల్స్ ఉన్నాయి. ఈ కలెక్షన్లో జెట్, క్వెస్ట్ హెల్మెట్లు, లెదర్ బూట్లు, హెడ్‌గేర్, దుస్తులు, ఇతర ప్రత్యేక వస్తువులు ఉన్నాయి. గూర్ఖా రెజిమెంట్ ఇన్సిగ్నియా, మిలిటరీ యూనిఫామ్ డిజైన్లు, క్రాస్డ్ ఖుక్రి గుర్తు వంటి అంశాల నుంచి వీటి డిజైన్‌కు స్ఫూర్తి పొందినట్లు కంపెనీ తెలిపింది.
ధర:
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గోర్ఖా ఎడిషన్ ధర రూ.2,10,684 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
Meet the Classic 350 Gorkha Edition. A new expression of the Classic, marked by the Khukri insignia and a distinct Gorkha character.#Classic350 #StayTrueStayClassic #RoyalEnfield #125YearsOfPureMotorcycling pic.twitter.com/mjdSD8b50P
— Royal Enfield (@royalenfield) August 18, 2026
తాజావార్తలు
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?