Pakistan is buying 60 lakh mosquito nets from India: పీకల్లోతు అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా భారత వ్యతిరేకతను వీడటం లేదు పాకిస్తాన్. భారతదేశంలో ఎలాంటి వాణిజ్య సంబంధాలు పెట్టుకోమని చెబుతోంది. కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించేంత వరకు, ఆర్టికల్ 370 పునుద్ధరించే వరకు తాము భారత్ తో సంబంధాలు పెట్టుకోమని అంటోంది. దీంతో అక్కడ టొమోటో, ఆలు వంటి నిత్యావసర ధరలు కొండెక్కాయి. కిలోకి రూ. 100కు పైగా ధరలు చేరాయి. భారత్ నుంచి సరుకులు రాక అక్కడి ప్రజలు అల్లాడారు.
ఇదిలా ఉంటే ఇండియాతో సంబంధాలు లేవంటూనే.. దిక్కులేక పాకిస్తాన్ దోమతెరలను భారత్ నుంచి కొనుగోలు చేసింది. జూన్ నెలలో పాకిస్తాన్ మొత్తాన్ని వరదలు ముంచెత్తాయి. మూడొంతుల భూభాగంలో ఒక వంతు నీటితో నిండిపోయింది. వంతెనలు, కరెంట్ స్తంభాలు, రోడ్లు, ఇళ్లు కొట్టుకుపోయాయి. ఎంతో సారవంతమైన భూమి దెబ్బతింది. ముఖ్యంగా సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సులు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో అక్కడి ప్రజలు అంటువ్యాధులతో సతమతం అవుతూ దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 2023 జనవరి వరకు పాకిస్తాన్ లోని 32 జిల్లాల్లో 2.7 మిలియన్ల మలేరియా కేసులు నమోదు అవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేస్తోంది.
Read Also: Eknath Shinde: ఏక్నాథ్ షిండే వర్గానికి గుర్తు కేటాయించిన ఈసీ.. గుర్తు ఏంటంటే..?
దీంతో మలేరియా వ్యాధుని తట్టుకునేందుకు భారతదేశం నుంచి సుమారు 60 లక్షల దోమ తెరలను కొనుగోలు చేయడానికి పాకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదం తెలిపింది. వీలైనంత త్వరగా భారత్ నుంచి వీటిని పొందేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ వరద కారణంగా 1700 మంది మరణించగా.. 3.3 కోట్ల మంది ప్రభావితం అయ్యారు. మలేరియా కేసులు సింధ్, పంజాబ్, బలూచిస్తాన్ లోని మొత్తం 26 జిల్లాల్లోకి తరలించే అవకాశం ఉంది.
భారతదేశం జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసింది. ఆగస్టు 5,2019న జమ్మూాకాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయం తరువాత ఇండియా-పాక్ సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. పాకిస్తాన్-భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు నిలిచిపోయాయి.