Kalki 2898 AD Update: ఆ స్టార్‌కు 90 నిమిషాల స్క్రీన్ టైమ్, రెండు డిఫరెంట్ లుక్స్!
- ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2
- సుప్రీమ్ యాస్కిన్ క్యారెక్టర్లో కమల్ హాసన్
- 90 నిమిషాల స్క్రీన్ టైమ్, రెండు డిఫరెంట్ లుక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఈ సినిమాలో చివర్లో కనిపించి షాకిచ్చిన పాత్రల్లో ముఖ్యమైనది ‘లోకనాయకుడు’ కమల్ హాసన్ పోషించిన సుప్రీమ్ యాస్కిన్ క్యారెక్టర్. తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ ఆ పాత్ర చుట్టూ ఏర్పడిన క్యూరియాసిటీ పార్ట్-2పై భారీ అంచనాలను పెంచేసింది. ఇప్పుడు ‘కల్కి 2’కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. కల్కి పార్ట్-2 షూటింగ్ ఫిబ్రవరి చివర్లోనే ప్రారంభం కానుంది. కమల్ హాసన్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను ఒక నెల రోజుల పాటు షూట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్ట్-2లో కమల్ పాత్ర నిడివి ఎక్కువగా ఉండనుందని, కథలో కీలక మలుపులు అతడి చుట్టూనే తిరగనున్నాయని టాక్. అందుకే షూటింగ్ షెడ్యూల్‌ను ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారట. కల్కి 2లో కమల్‌కు దాదాపు 90 నిమిషాల స్క్రీన్ టైమ్ ఉండనుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సీక్వెల్‌లో ఆయన రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఒక లుక్ పార్ట్-1కి కనెక్ట్ అయ్యేలా ఉండగా.. మరో లుక్ పూర్తిగా షాకింగ్‌గా ఉంటుందట. ఈ రెండు లుక్స్ కథకు కీలక టర్నింగ్ పాయింట్స్‌గా నిలవనున్నాయని తెలుస్తోంది.
Also Read
మరోవైపు కల్కి 2 ప్రాజెక్ట్‌లోకి ‘లేడీ పవర్ స్టార్’ సాయి పల్లవి కూడా ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉండనుందని, కథలో భావోద్వేగాలకు, లోతైన డ్రామాకు ఆమె క్యారెక్టర్ కీలకంగా మారనుందని టాక్. సాయి పల్లవి యాక్టింగ్, కమల్ హాసన్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, ప్రభాస్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే.. పార్ట్-2 ఏ రేంజ్‌లో ఉండబోతోందో ఊహించుకోవచ్చు. ప్రభాస్ అభిమానులు ఇప్పటికే కల్కి 2 కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్ట్-1తో భారతీయ సినిమాల స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్‌కు తీసుకెళ్లిన నాగ్ అశ్విన్.. సీక్వెల్‌తో మరింత పెద్ద విజన్‌ను ఆవిష్కరించబోతున్నాడని ఫిల్మ్ నగర్‌లో టాక్. అధికారిక అనౌన్స్‌మెంట్స్ త్వరలోనే రానున్నాయని సమాచారం.
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!