AC Coaches Missing: తప్పిపోయిందా? తప్పించుకొని పోయారా? రైలు నుంచి ఏసీ కోచ్ మిస్సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AC Coaches Missing: రైలుకు బోగిలు ఉంటాయి.. అవి రైలు పట్టాల మీద ఉంటాయని మనకు తెలుసు. కానీ పట్టాల మీద ఉన్న రైలు మూడు బోగిలు కనిపించకుండా పోయిన ఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంతకీ ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలుసా.. ఫిబ్రవరి 1వ తేదీ తెల్లవారుజామున ఒడిశాలోని సంబల్పూర్ రైల్వే స్టేషన్‌లో వెలుగు చూసింది. సంబల్పూర్ – నాందేడ్ నాగవళి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వు చేసిన కోచ్ కోసం టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు వారికి సీట్లు కేటాయించి బోగిలు కనిపించక ఆందోళన చెందారు. వాళ్ల బోగిలను వెతుక్కోవడం కోసం రైలు పొడవునా స్కాన్ చేయవలసి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: PM Modi: పీఎం మోడీ మాస్టర్ స్ట్రోక్.. వారంలో రెండు ఒప్పందాలు!
Also Read
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
పలు నివేదికల ప్రకారం.. భువనేశ్వర్ నుంచి నాందేడ్ వైపు ప్రయాణిస్తున్న రైలు నంబర్ 20809 సంబల్పూర్ చేరుకున్నప్పుడు ఓ ఏసీ కోచ్ కనిపించలేదు. తమకు కేటాయించిన 3AC కోచ్ కోసం ప్రత్యేకంగా వేచి ఉన్న కొంతమంది ప్రయాణికులు ఆందోళన చెందారు. 3AC కోచ్ BE2 కి కన్ఫర్మ్ టిక్కెట్లు ఉన్న 57 మంది ప్రయాణికులు.. ట్రైన్ మిస్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో రైలు వచ్చే సమయానికి కంటే ముందుగానే స్టేషన్‌కు చేరుకున్నారు. నాగావళి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రాగానే, వారు తమ కోచ్ కోసం వెతకడానికి రైలును మొత్తం స్కాన్ చేశారు. కానీ వారికి కేటాయించిన బోగి BE2 కోచ్ జత చేయకుండానే రైలు సంబల్‌పూర్ నుంచి బయలుదేరిందని స్పష్టమైంది. ఈ విషయాన్ని గ్రహించిన చాలా మంది ప్రయాణికులు ఇప్పుడు రైలు ఎక్కాలా వద్దా అని తెలియక తికమకపడ్డారు. కోచ్ లేకుండా వచ్చిన రైలు గురించి టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు సహాయం కోసం ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్స్ (TTE)ను సంప్రదించారు. పలు నివేదికల ప్రకారం.. టికెట్లు బుక్ చేసుకున్న వారిని ఇతర కోచ్‌లలోని సీట్లలో కూర్చోమని చెప్పారు, అంతే కానీ అసలు ఏం జరిగిందో స్పష్టమైన వివరణ ఇవ్వలేదని వివరించారు.
ఘటనపై రైల్వే అధికారుల వివరణ..
ఈ ఘటనపై తూర్పు కోస్ట్ రైల్వే అధికారులు స్పందిస్తూ.. “సాంకేతిక సమస్య కారణంగా, ఒక రిజర్వు కోచ్ (BE2) ను రైలు నంబర్ 20809 కు అటాచ్ చేయడం సాధ్యం కాలేదు. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులను ఆన్-బోర్డ్ TTE ఇతర కోచ్లలో అందుబాటులో ఉన్న ఖాళీ బెర్తులలో కూర్చునేలా ఏర్పాటు చేశారు” అని తూర్పు కోస్ట్ రైల్వే (ECoR) ఒక ప్రకటనలో తెలిపింది.
READ ALSO: Biker Release Date: శర్వా స్పీడ్ మామూలుగా లేదుగా! ‘బైకర్’ రిలీజ్ డేట్ లాక్..
తాజావార్తలు
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!