ఓవైపు దాడులు చేస్తూనే.. మరోవైపు భారత్‌లో కాళ్ల బేరానికి వచ్చినట్టే కనిపిస్తోంది.. పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగమంత్రి ఇషాక్ దార్.. భారత్ ముందు ఓ కీలక ప్రతిపాదన పెట్టారు.. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని ప్రకటించారు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. పాకిస్తాన్‌పై భారత్ దాడులు ఆపితే.. తామూకూడా ఆపుతాం అని వెల్లడించారు.. భారత్ దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధం అని పేర్కొన్నారు.