పాకిస్థాన్-సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. ఒక దేశంపై ఎవరైనా దాడి చేస్తే రెండు దేశాలపై దాడి చేసినట్లుగా భావించాలనేది ఈ ఒప్పందం యొక్క సారాంశం. అప్పుడు రెండు దేశాలు కలిసి శుత్రువుపై దాడికి దిగాలని ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందంపై అధ్యయనం చేస్తున్నట్లుగా ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరులో అమానుషం.. డెలివరీ ఆలస్యం అయిందని జొమాటో బాయ్‌పై మూక దాడి
తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందంలో ఇతర దేశాలు చేరడానికి తలుపులు మూసివేయబడలేదని పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సౌదీ అరేబియాతో పాకిస్థాన్ నాటో లాంటి ఒప్పందం జరిగిందని గుర్తుచేశారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ నాటోను విస్తరించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ రియాద్‌లో రక్షణ ఒప్పందంపై సంతకం చేశారని చెప్పారు.
ఇది కూడా చదవండి: Jodhpur: బాల్కనీలో ఉన్నప్పుడు మీరు ఇలా చేస్తున్నారా? షాకింగ్ వీడియో వైరల్
ఖవాజా ఆసిఫ్ జియో న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు చేరడానికి ఎల్లప్పుడూ అవకాశం ఉంటుందని సూచించారు. ముస్లిం దేశాలను రక్షించుకోవడం ప్రాథమిక హక్కుగా భావిస్తున్నట్లు చెప్పారు. అరబ్ దేశాలకు నాటో తరహా కూటమి చాలా అవసరత ఉందని స్పష్టం చేశారు. 40-50 ఏళ్ల నుంచి పాకిస్థాన్ ఎక్కువ దుర్బలత్వం అనుభవిస్తుందన్నారు. ఇక తాజాగా పాక్-సౌదీ మధ్య జరిగిన ఒప్పందంలో ఏ ఇతర దేశమైనా చేరొచ్చని సూచించారు. ఇందులో ఎలాంటి నిబంధన లేదన్నారు. పాకిస్థాన్ ఇతర దేశాలతో కూడా ఒప్పందాలపై సంతకాలు చేస్తుందని వివరించారు. పాకిస్థాన్ దగ్గర అణు సామర్థ్యం ఉన్నా.. ఎప్పుడూ కూడా ఎటువంటి ఉల్లంఘనకు పాల్పడలేదని పేర్కొన్నారు.

సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ బుధవారం రియాద్‌ను సందర్శించారు. రియాద్‌లోని అల్-యమామా ప్యాలెస్‌లో షరీఫ్‌ను సౌదీ యువరాజు కలిశారు. రెండు దేశాల మధ్య చారిత్రాత్మక, వ్యూహాత్మక సంబంధాలు సమీక్షించినట్లు పేర్కొన్నాయి. ఈ రెండు దేశాల మధ్య దాదాపు 8 దశాబ్దాలుగా చారిత్రాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. తాజా ఒప్పందం.. సోదరభావం.. ఇస్లామిక్ సంఘీభావం, అలాగే భాగస్వామ్య వ్యూహాత్మకం, రక్షణ సహకారానికి ఆధారపడి ఉందని ఉమ్మడి ప్రకటనలో పేర్కొంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్-సౌదీ రక్షణ ఒప్పందం చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. పైగా ఒక దేశంపై దాడి చేస్తే.. రెండు దేశాలపై దాడి చేసినట్లుగా భావించి.. రెండు దేశాల కలిసి శత్రువుపై దాడి చేయాలనేది కొత్త ఒప్పందం యొక్క ఉద్దేశం.
వాస్తవంగా భారత్-సౌదీ మధ్య కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య రియాద్‌లో ద్వైపాక్షిక సంబంధాలు కూడా జరిగాయి. మోడీ మూడు సార్లు సౌదీకి వెళ్లారు. 2016లో సౌదీ అరేబియా అత్యున్నత పౌర పురస్కారం అయిన కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్‌ను మోడీకి ప్రదానం చేశారు. భారతదేశం ఇప్పుడు సౌదీకి రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కూడా ఉంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రధాని మోడీ రియాద్ పర్యటన సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిని సౌదీ ఖండించింది. ఏ కారణం చేతనైనా ఉగ్ర దాడిని సమర్థించేది లేదని సౌదీ ప్రకటించింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని కూడా సౌదీ ఖండించింది. కానీ తాజాగా పాక్‌తో రక్షణ ఒప్పందం చేసుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో..!