పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్యకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు.
ప్రపంచ పటంలో తన స్థానాన్ని నిలుపుకోవాలంటే పాకిస్థాన్ తన గడ్డపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానేయాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపకపోతే పాకిస్థాన్‌ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామంటూ తీవ్ర వార్నింగ్ ఇచ్చారు.
అమెరికాతో పాకిస్థాన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని.. దీనిపై చైనా ఆందోళన చెందడం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. బ్రిటిష్-అమెరికన్ జర్నలిస్ట్ మెహదీ హసన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడారు.
పాకిస్థాన్-సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. ఒక దేశంపై ఎవరైనా దాడి చేస్తే రెండు దేశాలపై దాడి చేసినట్లుగా భావించాలనేది ఈ ఒప్పందం యొక్క సారాంశం. అప్పుడు రెండు దేశాలు కలిసి శుత్రువుపై దాడికి దిగాలని ఒప్పందం సంతకాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందంపై అధ్యయనం చేస్తున్నట్లుగా ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.
Pakistan: భారతదేశం చేతిలో ఎన్ని సార్లు భంగపాటుకు గురైనా నాదే పైచేయి అంటుంది పాకిస్తాన్. అబద్ధాలను అవలీలగా ప్రచారం చేస్తుంది. చివరకు పాకిస్తాన్ ప్రభుత్వంలో అగ్ర నేతలుగా చలామణీ అవుతున్న వారు కూడా అబద్ధాలను ప్రచారంలో చేయడంలో పోటీ పడుతున్నారు. తమ పౌరుల్ని అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ నుంచి పాకిస్తాన్‌ని భారత్ త్రివిధ దళాలు చితకబాదుతున్నా కూడా బుద్ధి రావడం లేదు.
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత.. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎట్టకేలకు నిజాన్ని ఒప్పుకున్నాడు. బ్రిటన్‌కు చెందిన స్కై న్యూస్‌తో జరిగిన సంభాషణలో ఖవాజా ఆసిఫ్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, ఉగ్రవాదానికి నిధులను అందించడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని అంగీకరించారు. తాము 30 సంవత్సరాలుగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామన్నారు.