వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకోవడంపై ఆ దేశ ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి గ్రహీత మారియా మచాడో హర్షం వ్యక్తం చేసింది. తాజాగా ఇదే అంశంపై మచాడో స్పందించారు. వెనిజులాలో అధికారం కోసం ట్రంప్‌తో ఎటువంటి చర్చలు జరపలేదని తెలిపారు. అక్టోబర్‌లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినప్పుడే ట్రంప్‌తో మాట్లాడానని.. అప్పటినుంచి ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. త్వరలోనే స్వదేశానికి వస్తున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Madras High Court: తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగింపుపై సంచలన తీర్పు
ఇదిలా ఉంటే తాజాగా చమురు, ఎన్నికలు, ఇన్‌ఛార్జ్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్‌బీసీ న్యూస్‌తో ట్రంప్ మాట్లాడుతూ.. వెనిజులా భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారు. వెనిజులాకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించగా.. ఒకే మాటలో ‘నేనే’ అన్నారు. వెనిజులాపై అమెరికా యుద్ధం చేయడం లేదని తెలిపారు. అలాగే సమీప భవిష్యత్‌లో ఎన్నికలు కూడా నిర్వహించబోమని తేల్చిచెప్పారు. దక్షిణ అమెరికా దేశాన్ని చక్కదిద్దడమే కర్తవ్యం అన్నారు. ప్రస్తుతం మౌలిక సదుపాయాలను పునర్నిర్మించాలని ట్రంప్ పేర్కొన్నారు. మొట్టమొదటిగా వెనిజులాను ఆరోగ్యంగా మార్చాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం 18 నెలల కన్నా తక్కువ సమయం పట్టవచ్చని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Indonesia Floods: ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు.. 14 మంది మృతి