జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వ్యక్తిపై ఇజ్రాయెల్ భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కేరళలోని తిరువనంతపురం జిల్లాకు చెందిన 47 ఏళ్ల థామస్ గాబ్రియేల్ మరణించాడు. గాబ్రియేల్.. కేరళలో రిక్షా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. టూరిస్ట్ వీసా మీద జోర్డాన్‌కు వెళ్లాడు. అక్కడ నుంచి ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిపై కాల్పులు జరపగా.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని స్వస్థలం తీసుకొచ్చేలా సాయం చేయాలని కేంద్రాన్ని గాబ్రియేల్ కుటుంబ సభ్యులు కోరారు.
ఇది కూడా చదవండి: Congress Vs BJP: కుంభమేళాకు హాజరుకాకపోవడంపై నేతల మధ్య మాటల యుద్ధం
గాబ్రియేల్… ఇజ్రాయెల్‌కు అక్రమంగా సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తుండగా భద్రతా దళాలు కాల్పులు జరిపి చంపారని అతని కుటుంబానికి అమ్మన్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ-మెయిల్ ద్వారా తెలియజేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో గాబ్రియేల్.. టూరిస్ట్ వీసా మీద జోర్డాన్ వెళ్లాడు. అయితే అక్కడ నుంచి ఇజ్రాయెల్ వెళ్లేందుకు ప్రయత్నించిన విషయం తమకు తెలియదు అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
భద్రతా దళాలు.. ఫిబ్రవరి 10న గాబ్రియేల్‌ను ఆపేందుకు ప్రయత్నించినా అతడు మాట వినలేదని.. దీంతో అతడిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని ఈ-మెయిల్‌లో పేర్కొంది. బుల్లెట్ తలలో తగలడంతో అక్కడికక్కడే చనిపోయాడని తెలిపింది. అతని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ఏ ఆస్పత్రిలో ఉంచారో అధికారులు ఆస్పత్రిని సందర్శించనున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.
ఇది కూడా చదవండి: Rebal Star : ప్రభాస్ – ప్రశాంత్ వర్మ.. అనౌన్స్‌మెంట్ వీడియో రెడీ.?
గాబ్రియేల్ చివరి సారిగా ఫిబ్రవరి 9న తమతో మాట్లాడాడని.. అప్పటి నుంచి తమకు ఫోన్ కాల్స్ లేవని బంధువు తెలిపారు. బస చేసిన ప్రాంతంలో సురక్షితంగా ఉన్నాడని అనుకుంటున్నట్లు తెలిపారు. అకస్మాత్తుగా కాల్ చేసి కట్ చేశాడు.. అప్పటి నుంచి తిరిగి ఫోన్ కాల్ రాలేదన్నారు.
‘‘దురదృష్టవశాత్తు ఒక భారతీయ పౌరుడు మరణించాడని రాయబార కార్యాలయం తెలిపింది. మృతుడి కుటుంబంతో రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. మృతుడి మృతదేహాన్ని తరలించడానికి జోర్డాన్ అధికారులతో కలిసి పనిచేస్తోంది.’’ అని జోర్డాన్‌లోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్‌లో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Sleeping : అతిగా నిద్రపోతున్నారా..?