ప్రముఖ పాప్ స్టార్ కేటీ పెర్రీ మరో తోడు వెతుక్కుంది. మాజీ ప్రధానితో కలిసి చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతోంది. ఎంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య కలుసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కెనడా 24వ ప్రధానిగా మార్క్ కార్నీ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కెనడా కేబినెట్ కొలువుదీరింది. కెనడా ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన ఇద్దరు మహిళలకు చోటుదక్కింది. కెనడియన్ పౌరురాలు అనితా ఆనంద్, ఢిల్లీలో జన్మించిన కమల్ ఖేడా కెనడియన్ పార్లమెంటుకు ఎన్నికైన అతి పిన్న వయస్కులైన మహిళలు వీరే. అనిత (58) ఇన్నోవేషన్, సైన్స్, పరిశ్రమల శాఖ మంత్రిగా, కమల్ (36) ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మాజీ ప్రధాన మంత్రి జస్టిన్…
కెనడా తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన సమావేశంలో మార్క్ కార్నీని అధికార లిబరల్ పార్టీ ఎన్నుకుంది. మార్క్ కార్నీ ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంతేకాకుండా మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం కూడా లేదు. అనూహ్యంగా కెనడా 24వ ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నిక కావడం విశేషం. ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నట్లు జస్టిన్ ట్రూడో జనవరిలో ప్రకటించారు. దీంతో లిబరల్ పార్టీలో కొత్త ప్రధాని ఎన్నిక అనివార్యమైంది. ఇది కూడా చదవండి:…
Justin Trudeau: కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో తన చివరి మీడియా సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన 9 ఏళ్ల పదవీకాలంలో గందరగోళ క్షణాలను, డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విధించిన భారీ సుంకాలను చర్చిస్తూ కంట తడి పెట్టారు. ప్రజాదరణ రేటింగ్ తగ్గుతున్న నేపథ్యంలో ట్రూడో జనవరిలో తాను ప్రధాని పదవికి, పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కెనడియన్లకు మొదటి ప్రాధాన్యం ఉండాలనే తన నిబద్ధతను చెప్పారు.
Justin Trudeau: డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కెనడాని, ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడోని టార్గెట్ చేస్తున్నారు. పలు సందర్భాల్లో కెనడాని అమెరికాలో 51వ రాష్ట్రం కలపాలంటూ, ట్రూడో గవర్నర్ గా ఉండాలంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా స్వీడన్, ఫిన్లాండ్, కెనడా, అమెరికా ఫోర్ నేషన్స్ ఫేస్-ఆఫ్ ఫైనల్‌లో కెనడా, అమెరికా ఐస్ హాకీలో తలపడ్డాయి. ఈ పోటీలో అమెరికాను కెనడా ఓడించింది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా సుంకాల విధింపుతో కెనడా, మెక్సికో, చైనాలను దెబ్బకొట్టాడు.
Donlad Trump: డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశాడు. కెనడా, మెక్సికోలపై సుంకాలు విధిస్తానని ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాన్ని అమలు చేశాడు. మంగళవారం నుంచి పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోల దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం, ట్రంప్ చైనా నుండి వచ్చే అన్ని దిగుమతులపై 10 శాతం, మెక్సికో, కెనడా నుండి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు
Canada: డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత నుంచి అక్రమ వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. అమెరికాలో అక్రమంగా డాక్యుమెంట్లు లేకుండా నివసిస్తున్న వారిని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బహిష్కరిస్తోంది. ఇప్పుడు కెనడా కూడా అదే దారిలో వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
ట్రంప్ తన నిర్ణయంపై ఎప్పుడు ముందుకెళ్లినా దానికి తగినట్లు స్పందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. ఆయన నిర్ణయం అమలు చేస్తే యూఎస్ వినియోగదారులే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అన్నారు.
Canada: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కెనడాపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ రియాక్ట్ అయ్యారు. యూఎస్ టారీఫ్ లు పెంచితే అమెరికన్లకు కూడా ట్రంప్ పన్నుల దెబ్బ తప్పదంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు.