టాలెంట్, గ్లామర్, లాంగ్ కెరీర్.. ఈ మూడింటినీ సమానంగా కలబోసుకున్న హీరోయిన్ త్రిష.. దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాదిన తనదైన ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. ‘పేట’, ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రాలతో తిరిగి క్రేజ్ అందుకున్న త్రిష, మరోవైపు ‘థగ్ లైఫ్’, ‘విదామయర్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి చిత్రాలతో మాత్రం కొంతమంది విమర్శల పాలైంది. ముఖ్యంగా ‘థగ్ లైఫ్’ లో ఆమె పాత్ర పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగింది. ఇక ప్రస్తుతం త్రిష తమిళంలో ‘కరుప్పు’, తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’, అలాగే విజయ్ సేతుపతితో ‘96’ సీక్వెల్‌లో నటిస్తోంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రిష.. సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read : Barqa Madan : గ్లామర్ ప్రపంచం వదిలేసి.. సన్యాసిగా మారిన RGV హీరోయిన్
2005లో వచ్చిన ‘అతడు’ చిత్రం త్రిష కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఇందులో మహేశ్ బాబుతో ఆమె జోడీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ‘సైనికుడు’ లో కూడా ఈ జోడీ కనిపించింది. అయితే రీసెంట్ గా ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష.. ‘మహేశ్ చాలా ప్రొఫెషనల్. ఉదయం 6 గంటలకు సెట్ లో ఉంటారు. రాత్రి 10.30 వరకు షూటింగ్‌లోనే ఉంటారు. నాకేమో షూటింగ్ అయిపోగానే అలసటతో వెంటనే ఇంటికి వెళ్ళి పోవాలనిపిస్తుంది. ఆయనను చూస్తే నేను తక్కువ పని చేస్తున్నట్టు గిల్టీగా ఫీలవుతాను. అంతగా డెడికేషన్ ఉన్న నటుడు. తన సీన్ లేకపోయినా మహేశ్ మానిటర్ దగ్గరే కూర్చుని సెట్లో ఏం జరుగుతోంది చూసేవారు. ఆయనతో పనిచేసే అనుభవం ప్రొఫెషనల్‌గా నేర్పిన పాఠంలాంటిది’ అని ఆమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.