Jai Shankar Says India-China Relations Are Not Normal: భారత్-చైనా సరిహద్దు సంబంధాలపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత లేనంతవరకూ.. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి రాలేవని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంపై తాము ఇప్పటికే చైనా నాయకత్వంతో పలుమార్లు చర్చించామని.. సమస్యాత్మక ప్రాంతాల నుంచి సైనికుల ఉపసంహరణ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సభ్యదేశాల విదేశాంగశాఖ మంత్రుల మండలి సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Anasuya: గాలికిపోయే కంపను మళ్లీ తగిలించుకోవడం అవసరమా ‘ఆంటీ’
అంతకుముందు గురువారం.. భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాల సాధారణీకరణ కోసం తూర్పు లడఖ్ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంతో పాటు వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంట శాంతి, ప్రశాంతతను కొనసాగించాల్సిన ఆవశ్యకతను చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్‌కు జైశంకర్ నొక్కి చెప్పారు. ఎస్‌సిఓ సదస్సు సందర్భంగా.. గోవాలోని తాజ్ ఎక్సోటికా రిసార్ట్‌లో ఈ ఇద్దరు విదేశాంగ మంత్రులు దాదాపు గంటసేపు సమావేశమయ్యారు. అపరిష్కృతమైన సమస్యలను పరిష్కరించడం, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి & ప్రశాంతతను నిర్ధారించడంపై ఈ చర్చ ఉద్దేశమని ఆయన ట్వీట్‌లోనూ పేర్కొన్నారు. ఇరువురు నేతల మధ్య జరిగిన సంభాషణ సరిహద్దు వివాదంపై కేంద్రీకృతమైందని, సకాలంలో పరిష్కారం కోసం జైశంకర్ ఒత్తిడి చేశారని ఓ వార్తా సంస్థ పేర్కొంది.
RR vs GT: రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం
గత రెండో నెలల్లో జైశంకర్, క్విన్‌లు ఇలా రెండోసారి సమావేశం అయ్యారు. జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు చైనా విదేశాంగ మంత్రి మార్చిలో భారత్‌కు వచ్చారు. ఆ పర్యటనలో, తూర్పు లడఖ్‌లో కొనసాగుతున్న సరిహద్దు వివాదం భారత్-చైనా సంబంధాలు ‘అసాధారణ’గా మారడానికి కారణమైందని క్విన్‌కు జైశంకర్ తెలియజేశారు.