ఇటలీలో భారతీయ వ్యవసాయ కార్మికుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటన తీవ్రంగా కలిచివేసింది. లాటినా ప్రాంతంలో పొలం పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ సత్నామ్ సింగ్ (31) చేయి తెగిపోయింది. అయితే తీవ్ర రక్తస్రావం అవుతున్నా.. కనీసం యజమానులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. నిర్లక్ష్యంగా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. ఈ అమానవీయ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలన రేపింది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. భారతీయులు కూడా తీవ్ర ఆందోళనలు చేపట్టారు.
అయితే ఈ ఘటనపై ఇటలీ ప్రధాని మిలోని చలించిపోయారు. తీవ్రంగా ఖండించారు. చనిపోయిన భారతీయ కార్మికుడు సత్నామ్ సింగ్‌కు జార్జియా మెలోని నివాళులర్పించారు. ఈ ఘటనపై పార్లమెంట్‌లో ఇటనీ ప్రధాని స్పందిస్తూ.. ఇది ఇటాలియన్ ప్రజలకు అమానవీయ చర్యగా అభివర్ణించారు. ఈ అనాగరికతను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇక తెగి పడిపోయిన చెయ్యిని రోడ్డున పక్కన పడేసి వెళ్లిపోవడం మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని పార్లమెంట్ వేదికగా మెలోని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Tamannah: వివాదంలో తమన్నా.. 7వ తరగతి విద్యార్థులకి పాఠంగా జీవిత చరిత్ర?